పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ దరఖాస్తులు

పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 2 నుంచి 28 వరకూ.. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. రాష్ట్ర ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 2 నుంచి అప్లై చేసుకునేందుకు వీలు కలిగించింది. ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సంక్రాంతి లోపు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ ప్రకారం.. సంక్రాంతి పండుగ నాడు.. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేలా.. జిల్లాల్లో అధికారులు ప్లాన్ చేసుకుంటున్నారు.

కొత్త రేషన్ కార్డులను పసుపురంగులో ఉండేలా, ఏపీ రాజ ముద్ర మాత్రమే వాటిపై ఉండేలా ముద్రిస్తోంది.

డిసెంబర్ 2 నుంచి మాత్రమే రేషన్ కార్డుల్లో మార్పులు చెయ్యడానికి వీలవుతుంది. ఆ రోజున మాత్రమే సర్వర్ అందుబాటులోకి వస్తుంది. అందువల్ల అధికారులు డిసెంబర్ 2 నుంచి మాత్రమే రేషన్ కార్డుల మార్పుల దరఖాస్తులను తీసుకుంటారు. దరఖాస్తు చేసుకునే వారు.. సచివాలయాలకు వెళ్లి, దరఖాస్తు ఫారాలను తీసుకోవచ్చు. లేదా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్‌ (https://epds2.ap.gov.in/epdsAP/epds)లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా.. రిజిస్టర్ అయ్యి, తర్వాత లాగిన్ అవ్వాలి. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఫారంపై క్లిక్ చేసి, వివరాలు నింపి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చెయ్యాలి. తర్వాత సబ్‌మిట్ క్లిక్ చెయ్యాలి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page