తెలంగాణ ప్రజలు 9 ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు ప్రభుత్వం తెరదించింది. రేషన్ కార్డులు అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లు చేర్చే ప్రక్రియను తెలంగాణ సరఫరాల శాఖ ప్రారంభించింది. మొత్తం 12.07 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు రాగా 6.70 లక్షల కుటుంబాలను ప్రాథమికంగా అర్హులుగా గుర్తించింది. అలాగే కొత్తగా 18.01 లక్షల మంది పేర్లు చేర్చాలని వినతులు రాగా వారిలో 11.50 లక్షల మందిని ప్రాథమికంగా అర్హులుగా గుర్తించారు. ఫిబ్రవరి తొలివారమా ఆఖరికి 1.03 లక్షల మందిని రేషన్ కార్డుల్లో కొత్త లబ్ధిదారులు గుర్తించారు.
కొన్ని కుటుంబ రేషన్ కార్డుల్లో పిల్లల పేర్లు లేకపోవడంతో వారికి రేషన్ సరుకులు పంపిణీ జరగడం లేదు. అలాగే అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన రేషన్ కార్డులో పేరు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ పథకం కూడా వర్తించడం లేదు. అర్హత కలిగి ఉన్నప్పటికీ రేషన్ కార్డుల్లో పేర్లు లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
దరఖాస్తులను రెండు రకాలుగా పరిశీలించి దరఖాస్తులోని ఆధార సంఖ్య సరిగ్గా ఉందా లేదా అన్నది చూస్తున్నారు ఆ తర్వాత ఆయన పేర్లు ఇతర రేషన్ కార్డుల్లో యాడ్ చేయబడ్డాయా లేదా అన్నది సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులలో ఆడ్ చేస్తున్నారు
Leave a Reply