నేటి నుంచి కొత్త పెన్షన్లు మరియు రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

నేటి నుంచి కొత్త పెన్షన్లు మరియు రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 28 వరకు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి దరఖాస్తులకు స్వీకరించనుంది..  ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సంక్రాంతి కి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుంది.

కొత్త రేషన్ కార్డులను పసుపురంగులో ఉండేలా, ఏపీ రాజ ముద్ర మాత్రమే వాటిపై ఉండేలా ముద్రిస్తోంది.

డిసెంబర్ 2 నుంచి మాత్రమే రేషన్ కార్డుల్లో మార్పులు చెయ్యడానికి వీలవుతుంది. ఆ రోజున మాత్రమే సర్వర్ అందుబాటులోకి వస్తుంది. అందువల్ల అధికారులు డిసెంబర్ 2 నుంచి మాత్రమే రేషన్ కార్డుల మార్పుల దరఖాస్తులను తీసుకుంటారు.

దరఖాస్తు చేసుకునే వారు.. సచివాలయాలకు వెళ్లి, దరఖాస్తు ఫారాలను తీసుకోవచ్చు. లేదా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్‌ (https://epds2.ap.gov.in/epdsAP/epds)లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా.. రిజిస్టర్ అయ్యి, తర్వాత లాగిన్ అవ్వాలి. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఫారంపై క్లిక్ చేసి, వివరాలు నింపి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చెయ్యాలి. తర్వాత సబ్‌మిట్ క్లిక్ చెయ్యాలి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page