సామాన్యులకు మరియు చిరు వ్యాపారులకు ఉరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి జీఎస్టీ పై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, కొత్త జీఎస్టీ విధానంపై మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అసలు జీఎస్టీ అంటే ఏమిటి? [What is GST]
మనం కొని ప్రతి వస్తువు మరియు మనం పొందే ప్రతి సేవపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే టాక్స్ ని మనం జీఎస్టీ అని అంటాం. ఇది వివిధ వస్తువు మరియు సేవల కేటగిరీలను బట్టి ఐదు నుంచి 28% వరకు టాక్స్ పడుతుంది. ఇందులో కేంద్ర రాష్ట్ర వాటాలు ఉంటాయి. చాలావరకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా జీఎస్టీని పంచుకుంటాయి. మన నుంచి వసూలు చేసే GST లో కేంద్ర వాటా ను CGST అని రాష్ట వాటా ను SGST అని, అంతరాష్ట్ర వాటాను IGST అని పిలుస్తారు. ఇదంతా కలిపి GST కింద వసూలు అవుతుంది.
ఉదాహరణకు మీరు ఏదైనా వస్తువు షాపులో కొంటే దానిపైన మీకు తెలియకుండా 12% జిఎస్టి అంటే టాక్స్ చెల్లిస్తున్నారు.
ప్రస్తుతం అసలు ఎన్ని జిఎస్టి స్లాబులు ఉన్నాయి (how many GST Slabs are in place)
ప్రస్తుతం నాలుగు జిఎస్టి స్లాబ్ లు ఉన్నాయి. 5, 12, 18, 28% స్లాబులు ఉన్నాయి. వీటిలో నిత్యవసర వస్తువులపై ఐదు శాతం, సాధారణ వస్తువుల పై 12%, ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర సేవలపై 18%, లగ్జరీ మరియు హానికారిక వస్తువులపై 28% జిఎస్టి కేంద్రం ప్రస్తుతం విధిస్తుంది.
ఇకపై కొత్త స్లాబులు ఇలా ఉంటాయి(new GST Slabs 2025)
ఇకపై నాలుగు జిఎస్టి స్లాబుల స్థానంలో కేంద్రం రెండు నుంచి మూడు స్లాబులు తెచ్చే అవకాశం ఉంది.
- 5% slab
- 18% slab
- 40% slab
దాదాపు అన్ని వస్తువులు మరియు సేవలపై ఇకపై ఐదు లేదా 18% జిఎస్టి విధించనుంది. సాధారణ వస్తువులు ఏవైతే పన్నెండు శాతం జీఎస్టీ విభాగంలోకి వస్తాయో వాటిని ఐదు శాతం లోకి తెచ్చే యోచన లో కేంద్ర ప్రభుత్వం ఉంది.
ఇక సమాజానికి హానికారమైనటువంటి వస్తువులపై 40% జిఎస్టి పెంచే అవకాశం ఉంది.

ఈ నిర్ణయం అమలు అయితే సామాన్యులకు చాలా ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం దీపావళి నుంచి ఈ కానుకను ప్రజలకు అందించాలని కార్యచరణ రూపొందిస్తుంది. అయితే తుది ఉత్తర్వులు ఇంకా వెలవడాల్సి ఉంది.

Leave a Reply