ఖరీఫ్ సీజన్లో పంట నమోదు ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలను తీసుకొస్తుంది. ఈ సీజన్లో 89.37 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా ఉన్నా, వర్షాలు ఆలస్యం కావడంతో కేవలం 9.07 లక్షల ఎకరాల మాత్రమే పంటలు సాగయ్యాయి. ఈక్రాప్ నమోదు ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక సమస్యలు రాకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టారు
ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే ప్రారంభం కాగా, మిగిలిన జిల్లాల్లో వచ్చే వారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాలు మరియు పంటల బీమా వర్తిస్తుంది. ఇంటి దగ్గర నియోజకవర్గ నమోదు అవుతున్నప్పటికీ సమస్యల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను అధిగమించడానికి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఎన్ఐసి సౌజన్యంతో ప్రత్యేక డిజైన్ చేశారు.
ఈ యాప్ వెబ్ ల్యాండ్, సిసిఆర్సి డేటా తో అనుసందించబడి ఉంటుంది. రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే సర్వే నెంబర్లలో ఎంత విస్తీర్ణం కౌలు భూములు ఉన్నాయి తెలుసుకోవచ్చు. మొదటిగా ఆధార్, 1బి, NPCI, ఆధార్ కార్డు లింక్ అయినా బ్యాంక్ ఖాతా వివరాలు ఫోన్ నెంబర్ CCRC కార్డుల వివరాలు ఈ యాప్ లో నమోదు చేస్తారు. తర్వాత వ్యవసాయ ఉద్యాన రెవెన్యూ కలిసి ప్రతిరోజు కనీసం 50 ఎకరాలు తక్కువ కాకుండా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు.
ఈ యాప్ లో జియో ఫెన్సింగ్ ద్వారా పంట పొలాల సరిహద్దులను గుర్తిస్తారు.
Leave a Reply