ప్రధానమంత్రి ముద్ర యోజన PMMY అనేది చిన్న సూక్ష్మ పరిశ్రమల ద్వారా వ్యాపారం చేసుకుంటున్నటువంటి వారికి ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణ పథకం. ఈ పథకాన్ని ఏప్రిల్ 8 2015 న ప్రధానమంత్రి నరేంద్ర మో ప్రారంభించారు.
ఎలాంటి కూచికత్తులు లేకుండా 10 లక్షల వరకు రుణం
ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా సూక్ష్మ, చిన్న పరిశ్రమలు పెట్టినవారు సులభంగా 50 వేల నుంచి 10 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు.
ఈ రుణాలను సంబంధిత అప్లికేషన్ ఫారం ను తీసుకొని వాటిని నింపి కావలసిన డాక్యుమెంట్లను జత చేసి సమీప ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకులో సమర్పించి రుణం పొందవచ్చు.
బ్యాంకులే కాకుండా సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBలు), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు NBFCల నుంచి కూడా ఈ రుణాలను పొందవచ్చు.
ఈ రుణాలకు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేదు.ఈ రుణాలను సాధారణంగా 10 నుంచి 12% వరకు వడ్డీతో బ్యాంకులు మంజూరు చేస్తాయి. ఈ రుణాలను మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది.
ముద్ర యోజన లో మూడు రకాల లోన్స్
ముద్ర యోజన ద్వారా అందించబడుతున్నటువంటి లోన్స్ ను నగదు ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది.
- శిశు – కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారికి 50 వేల వరకు లోన్ ని ఐదు సంవత్సరాల వ్యవధితో అందించడం జరుగుతుంది.
- కిశోర్ – ఇప్పటికే వ్యాపారం ఉన్నవారు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ లోన్ తీసుకోవచ్చు. 50 వేల నుంచి ఐదు లక్షల వరకు రుణం పొందవచ్చు.
- తరుణ్ – ఐదు నుంచి పది లక్షల వరకు రుణం తీసుకునే వారికి తరుణ్ అనే కేటగిరీలో లోన్స్ మంజూరు చేయడం జరుగుతుంది.
ముద్ర యోజన రుణం పొందటానికి కావలసిన డాక్యుమెంట్స్ మరియు అర్హతలు
రుణం తీసుకునే వ్యక్తి భారతీయ పౌరుడై ఉండాలి.
వయసు 24 నుంచి 70 ఏళ్ల లోపు ఉండాలి. రుణం కేవలం సూక్ష్మ చిన్న పరిశ్రమ ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి మాత్రమే తీసుకోవాలి.
అర్హత ఉన్నవారు మీరు తీసుకోవాలనుకుంటున్నటువంటి రుణానికి సంబంధించినటువంటి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని వాటిని నింపి, మీ ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ మరియు ఇతర ధ్రువీకరణ పత్రాలతో మీ సమీప బ్యాంక్ లో సంప్రదించవచ్చు. లేదంటే ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం మీరు అఫీషియల్ లింక్ చూడండి లేదా మీ బ్యాంకులో సంప్రదించండి.
ముద్ర యోజన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మరియు ప్రాసెస్
కింద ఇవ్వబడినటువంటి అఫీషియల్ అనగా అధికారిక వెబ్సైట్ కి వెళ్లి మీరు ముద్ర లోన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ముద్ర లోన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు మూడు ఆప్షన్స్ చూపిస్తాయి.
New Enterprise – కొత్తగా పరిశ్రమ లేదా వ్యాపారం ప్రారంభిస్తున్న వారు.
Existing Enterprise – ఇప్పటికే సూక్ష్మ/చిన్న కలిగి ఉన్నవారు.
Self Employed Professional – స్వయం ఉపాధి కలిగి ఉన్న నిపుణులు.
ఎంచుకున్న తర్వాత మీ పేరు, email, మొబైల్ నంబర్ వంటివి ఎంటర్ చేసి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లో భాగంగా మీ వివరాలన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
అయితే మీకు త్వరగా పని అవ్వాలంటే మీరు కింద ఇవ్వబడిన అప్లికేషన్ ఫారం నింపి సమీప బ్యాంకులో సంప్రదిస్తే బెటర్.
ముద్ర యోజన అప్లికేషన్ ఫారం
శిశు, కిషోర్, తరుణ్ ద్వారా రుణం పొందాలనుకునే వారు కింద ఇవ్వబడిన అధికారిక లింకు ద్వారా అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోండి.
Leave a Reply