గత రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట (ecrop) నమోదు చేసుకోమని రైతులను కోరుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఖరీఫ్ పంటకు సంబంధించిన పంట నమోదు కార్యక్రమం కొనసాగుతుంది.
మరోవైపు మొంథా తుఫాన్(Montha cyclone – farmers ecrop registration) వలన చాలా మంది రైతులు తమ పంటను నష్ట పోయారు. అయితే ప్రతి ఏటా ఇలాంటి విపత్తుల వలన కలిగే నష్టాన్ని అంచనావేసి ప్రభుత్వం ఈ పంటలో నమోదు చేసుకున్న పంట వివరాల ఆధారంగా నష్టపరిహారం అందిస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి ఇంకా ఎవరైనా రైతులు ఈ పంట నమోదు చేసుకోకపోతే వెంటనే మీ సమీప రైతు సేవ కేంద్రానికి వెళ్లి తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలి.

పంట నమోదుకు ఎప్పటి వరకు గడువు ఉంది?
ఇప్పటికే పలుమార్లు చివరి తేదీని పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సెప్టెంబర్ 30 వరకు ఈ పంట నమోదు చేసుకునే అవకాశాన్ని రైతులకు కల్పించింది. అయితే ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులు మీకు త్వరగా నష్టపరిహారం అందాలంటే వెంటనే వెళ్లి రైతు సేవ కేంద్రంలో పంట నమోదు చేసుకోవాలి.
ఈ పంట నమోదు చేసుకోవడం వలన రైతులకు విపత్తుల సమయంలో కలిగే నష్టానికి ప్రభుత్వం అందించే పరిహారం పొందవచ్చు, పంటల భీమా పథకం పరిహారం కూడా పొందవచ్చు. ఇంతే కాకుండా ఇంకా ఏమైనా రైతు సంబంధిత ప్రయోజనాల కొరకు ఈ పంట నమోదు తప్పనిసరి.
మరి మీరు ఈ పంట నమోదు పూర్తి చేసుకున్నారా? స్టేటస్ తెలుసుకునేందుకు ఇక్కడ కింద ఇవ్వబడిన ఆన్లైన్ లింక్ లో చూడవచ్చు. లేదా మీ సమీప రైతు సేవా కేంద్రానికి వెళ్లి స్టేటస్ తెలుసుకోవచ్చు.



