తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ గుడ్ న్యూస్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు ప్రజా గర్జన సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో మహబూబ్ నగర్ లో పలు జాతీయ రహదారులు మరియు రైల్వే ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సభ వేదిక నుంచి రాష్ట్రానికి పలు కీలక హామీలను ప్రకటించారు.
తెలంగాణకు పసుపు బోర్డు, టెక్స్టైల్ పార్క్
తెలంగాణలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి పసుపు బోర్డు హామీని నెరవేరుస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. పసుపు రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు, బోర్డు ఏర్పాటుతో ఇక్కడ రైతులకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు.
అదేవిధంగా ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 900 కోట్లతో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన హామీ ఇచ్చారు.
దేశంలో ఏర్పాటు చేయనున్న ఐదు టెక్స్టైల్ పార్క్ లో ఒకటి తెలంగాణ లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
హన్మకొండ లో నిర్మించే ఈ టెక్స్టైల్ పార్క్ ద్వారా వరంగల్ , ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు.
అదేవిధంగా ప్రస్తుతం చేపట్టిన రైల్వే మరియు జాతీయ రహదారుల పనుల ద్వారా తెలంగాణ, మహారాష్ట్ర మరియు ఏపీ మధ్య మరింత అనుసంధానం పెరుగుతుందని ప్రధాని తెలిపారు.
మరో వైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ చుట్టూ నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ రైల్వే లైన్ నిర్మించేందుకు కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం 26 వేల కోట్లను కేంద్రం కేటాయించిందని అన్నారు.
Leave a Reply