రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 13న జరగనున్న పట్టభద్రులు మరియు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఓటర్ల జాబితా విడుదల అవ్వగా, ఈ మేరకు ప్రచారం కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్స్ స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా అధికారులు చేపట్టారు.
అభ్యర్థులకు ఫోన్ చేసి ఓటర్ స్లిప్స్ కలెక్ట్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. కొన్నిచోట్ల అభ్యర్థులకు నేరుగా కూడా అందిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ మొత్తం ఈ వారం లోపు పూర్తి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో మార్చి 8 నాటికి అందరికీ ఓటర్ స్లిప్స్ పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులకు అవగాహన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.
అభ్యర్థులు ఆన్లైన్లో కూడా తమ ఓటు వివరాలను చెక్ చేసుకోవచ్చు.
కింది లింక్ ని క్లిక్ చేసి జిల్లా మండలం గ్రామం వివరాలు ఎంటర్ చేసి తమ ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
ఓటర్ స్లీప్ లో ఏ డీటైల్స్ ఉంటాయి
అభ్యర్థులకు జారీ చేసే ఓటర్ స్లీప్ కింది విధంగా ఉంటుంది. ఇందులో మీ పేరు, మీ తండ్రి పేరు, మీ నియోజకవర్గం, మీ పోలింగ్ బూత్ వివరాలు తో పాటు మీరు ఎక్కడ ఓటు వేయాలో కూడా క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది.
ఎన్నికల టైమింగ్స్ ఏంటి?
పోలింగ్ మార్చి 13న జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. పోలింగ్ బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహిస్తారు.
Leave a Reply