MLC Election 2023 – ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటు వేయడం ఎలా? పూర్తి విధానం

MLC Election 2023 – ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటు వేయడం ఎలా? పూర్తి విధానం

పట్టపద్రులు మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 13న అంటే సోమవారం రోజున జరగనున్నాయి. ఎన్నికలకు ముందుగా గ్రాడ్యుయేట్ లకు ఓటర్ స్లిప్పులను సచివాలయం ద్వారా ఇస్తారు. అందనివారు డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ లేదా రిటర్నింగ్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ను కలవచ్చు.

ఓటు వేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు

  • ఓటర్ స్లిప్పు
  • EPIC కార్డు ( ఓటర్ ఐడి/ ఓటర్ కార్డు/ ఎలక్షన్ కార్డు)

ఒకవేళ మీ వద్ద ఓటర్ కార్డు లేకపోతే ఈ క్రింది ఏదైనా గుర్తింపు కార్డులలో ఒకదానిని తీసుకొని వెళ్ళవచ్చు

  1. ఆధార్ కార్డు
  2. డ్రైవింగ్ లైసెన్స్
  3. పాన్ కార్డ్
  4. పాస్ పోర్ట్
  5. సర్వీస్ ఐడి కార్డ్
  6. అఫీషియల్ ఐడి కార్డ్ ( for MPs / MLAs / MLCs)
  7. సర్వీస్ ఐడెంటిటీ కార్డ్ ( issued by By the educational institutions in which the electrons of the consent teachers / graduates constituency maybe employed)
  8. సర్టిఫికెట్ ఆఫ్ డిగ్రీ ఆర్ డిప్లమా ( issued by University – original)
  9. సర్టిఫికెట్ ఆఫ్ ఫిజికల్ హ్యాండీక్యాప్ (issued by competent authority)

ఓటు వేసే విధానం

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జాగ్రత్తగా ఓటు వేయాలి. ఓటు వేసేందుకు కింది ప్రొసెస్ ఫాలో అవ్వండి

ఈ ఎలక్షన్ బ్యాలెట్ పేపర్ విధానంలో జరుగుతుంది.

  • పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులు మీకు బ్యాలెట్ పేపర్ తో పాటు ఊదా రంగు ( voilet color) స్కెచ్ పెన్ను ను ఇస్తారు.
  • అభ్యర్థులకు సంబంధించిన పేర్లు మాత్రమే బ్యాలెట్ పేపర్ లో ఉంటాయి. పార్టీ గుర్తులు ఉండవు.
  • మీరు ఎంచుకున్న అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న బాక్స్ లో ప్రాధాన్యత అంకెలు (1,2,3,4 తదితర) వేయాల్సి ఉంటుంది.
  • 1వ నెంబర్ ను తప్పనిసరిగా ఎవరోకరికి నమోదు చేయాలి. తర్వాత 2,3,4 నంబర్లను నచ్చిన వారికి వేసుకోవచ్చు. మిగిలినవి వెయ్యక పోయినా ఏమి కాదు కానీ 1వ నెంబర్ వెయ్యకపోతే ఆ ఓటు చెల్లదు.
Correct format to vote
This is also correct ఇలా కూడా వేయవచ్చు
  • అధికారులు ఇచ్చే ఊదా రంగు స్కెచ్ పెన్ తో మాత్రమే ఈ ఓటు నెంబర్ ను అభ్యర్థి ఎదురుగా ఉండే బాక్స్ లో రాయాలి.
  • ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్ను మడిచి బ్యాలెట్ బాక్స్ లో వేయాలి.
  • పెన్, పెన్సిల్ లేదా ఇతర పరికరాలతో మార్క్ చేయకూడదు. వేలిముద్రలు కూడా వేయకూడదు.
  • పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్, కెమెరా, డిజిటల్ పెన్ లాంటి వాటిని అనుమతించరు.

ఓటింగ్ వేసే సమయంలో చేయదగినవి ( Do’s)

  • పోలింగ్ కేంద్రంలో ఇచ్చిన ఊదా రంగు పెన్నులు మాత్రమే ఓటు వేయడానికి వినియోగించాలి.
  • ఓటరు తాను మొదటి ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న ఖాళీ గాడిలో ఒకటి అనే అంకె ను నింపవలెను.
  • మిగిలిన అభ్యర్థులకు రెండు మూడు నాలుగు అనే మిగిలిన ప్రాధాన్యత అంకెలు వేసుకోవచ్చు.
  • ఒక అభ్యర్థికి ఒక అంకె మాత్రమే వేయవలెను.
  • రోమన్ అంకెలలో కూడా ఓటు వేయవచ్చును.

ఓటింగ్ సమయంలో చేయకూడనివి ( Dont’s)

  • ప్రాధాన్యత క్రమంలో ఒకటవ అంకె వేయకపోతే ఓటు చెల్లుబాటు కాదు అంకెలలో మాత్రమే ఓటు వేయాలి అక్షరాలలో రాయరాదు.
  • ఒక అంకె ఒకరి కన్నా ఎక్కువ మందికి వేసిన ఓటు చెల్లదు.
  • టిక్ మార్క్ మాత్రం వేయరాదు.

Complete process Demo Video

Click here to Share

One response to “MLC Election 2023 – ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటు వేయడం ఎలా? పూర్తి విధానం”

  1. MLC Elections 2023 : ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు వేసేందుకు వెళ్తున్నారా అయితే ఈ ముఖ్యమైన సూచనలు తప్పకుండా తెల

    […] […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page