మిషన్ వాత్సల్య పథకం కేంద్ర ప్రభుత్వం ద్వారా అనాధ పిల్లల సంరక్షణ కొరకు ప్రారంభించబడిన ప్రత్యేక పథకం.
మిషన్ వాత్సల్య పథకానికి నేడే చివరి తేదీ. ఏప్రిల్ 30 వరకు అవకాశం కల్పించిన కేంద్రం
Mission Vatsalya last date extended
గతంలో ఉన్నటువంటి బాలల రక్షణ పథకం ( చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్) ను 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి మిషన్ వాత్సల్య పథకంతో అమలు చేస్తున్నారు. ఈ పథకం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేయబడుతుంది. ఇందులో కేంద్రం వాటా 60 శాతం రాష్ట్రాల వాటా 40 శాతం ఉంటుంది. కొన్ని ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో 90% కేంద్ర వాటా ఉంటుంది.
ఈ మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఏమి అమలు చేస్తారు
రాష్ట్రాలు మరియు జిల్లాల భాగస్వామ్యంతో, పిల్లల కోసం 24×7 హెల్ప్‌లైన్ సేవను అమలు చేస్తుంది. (As per Juvenile Justice act 2015)
అనాధ పిల్లలు లేదా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల సంరక్షణ కొరకు శరణాలయాలు, ప్రత్యేక వసతి గృహాలను నిర్వహిస్తుంది.
దేశవ్యాప్తంగా పిల్లల దత్తతను CARA/SARA ఏజెన్సీల ద్వారా ప్రోత్సహిస్తుంది.
అదేవిధంగా అనాధ పిల్లలకు నెల కు ₹4000 ఆర్థిక సహాయాన్ని కూడా ఈ పథకం ద్వారా అందిస్తున్నారు.
మిషన్ వాత్సల్య పథకానికి ఎవరు అర్హులు
కింద ఇవ్వబడిన ఏదైనా జాబితాలో 18 ఏళ్ల లోపు ఉన్న వారు ఈ పథకం ద్వారా లబ్ది పొందేందుకు అర్హులు
- అనాథలుగా ఉంటూ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న వారు
- వితంతువు లేదా విడాకులు పొందిన తల్లి వద్ద ఉండే పిల్లలు
- తల్లిదండ్రులు ప్రాణాపాయ/ ప్రాణాంతక వ్యాధికి గురై ఉండి, తల్లిదండ్రులు ఆర్థికంగా శారీరకంగా అసమర్థులు అయి పిల్లలను చూసుకోలేని వారు
- జువైనల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం రక్షణ, సంరక్షణ అవసరమైన పిల్లలు ప్రకృతి వైపరీత్యానికి గురైన బాలలు,బాలకార్మికులు అంగవైకల్యం కలిగిన పిల్లలు, ఇంటి నుంచి పారిపోయి వచ్చిన వారు. బాల యాచకులు,వీధుల్లో నివసించే బాలలు, సహాయం, పునరావాసం అవసరమైన వారు, దోపిడీకి గురైన బాలలు
- కొవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ‘సీఎం కేర్స్ ఫర్ పథకం కింద నమోదైన వారు.
Note: తల్లి వితంతువు లేదా విడాకులు తీసుకుని ఉన్న పిల్లలు కూడా అర్హులే అయితే వారి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 72000, పట్టణాల్లో అయితే 96000 మించారాదు. తల్లి విడాకులు పొందినా లేదా భర్త పూర్తిగా వదిలిపెట్టినట్లయితే మీ విఆర్వో నుంచి ధ్రువపత్రం తీసుకోవాలి.
a) Rs. 72,000/- per annum for rural areas,
b) Rs. 96,000/- per annum for others.
మిషన్ వాత్సల్యకు దరఖాస్తు కావాల్సిన డాక్యుమెంట్ లు ఏవి?
☛ బాలుడి లేదా బాలిక జనన ధ్రువీకరణ పత్రం
☛ బాలుడి లేదా బాలిక ఆధార్ కార్డు
☛ తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రము,మరణ కారణము
☛ తల్లి లేదా తండ్రి యొక్క ఆధార్
☛ గార్డియన్ ఆధార్ కార్డు
☛ రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డు
☛ కుల ధ్రువీకరణ పత్రము
☛ బాలుడి లేదా బాలిక పాస్ ఫోటో
☛ స్టడీ సర్టిఫికేట్
☛ ఆదాయ ధ్రువీకరణ పత్రము (బ్రతికి ఉన్న తల్లి ది)
☛ బాలుడి లేదా బాలిక వ్యక్తిగత బ్యాంక్ ఎకౌంటు లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులతో కలిసిన జాయింట్ అకౌంట్.
Note: ఇద్దరు పిల్లలు ఉంటే రెండు అకౌంట్స్ తీసుకోవాలి.
ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి? ఎప్పటి వరకు అవకాశం ఉంది?
ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణలో అయితే మీ సమీప శిశు సంక్షేమ కార్యాలయంలో లేదా అంగన్వాడీ కేంద్రంలో సంప్రదించండి.
ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 30 చివరి తేదీ గా ఉందని అధికారులు తెలిపారు. అనాధ పిల్లలను గుర్తించడంలో ఉపాధ్యాయులు, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీలు, వాలంటీర్లు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర బాలల హక్కు కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు వెల్లడించారు. సర్టిఫికెట్లు పొందటానికి కొంత సమయం పడుతున్న నేపథ్యంలో గడువు పెంపు కోసం కేంద్రాన్ని అభ్యర్థించినట్లు ఈ మేరకు కేంద్రం అంగీకరించినట్లు కేసలి అప్పారావు తెలిపారు.
పూర్తి వివరాలు కింది వీడియో ద్వారా కూడా చూడవచ్చు
48 responses to “Mission Vatsalya: అనాధ పిల్లలకు నెలకు 4000 రూపాయలు..మిషన్ వాత్సల్య దరఖాస్తు గడువు పొడిగింపు”
mission vathaylya amount enka credit kaledu yepudu avthundi chepagalara
ఇప్పుడు అవకాశం ఉంది సార్
Please expire the date upto may month
im raghurathod add my application
తెలంగాణ రాష్ట్రంలో అమలు అయ్యిందా
కొందరు అంగన్వాడి పాఠశాలలలో ఈ స్కీము తెలంగాణలో అమలు చేయబడలేదు అని ప్రచారం చేస్తున్నారు అది ఎంతవరకు నిజం
అయింది . దేశ వ్యాప్తంగా
I don’t have ration card then what to do now
eligibility list yepudu release chestaru this year r next year
onine aina tarvatha apply chesina valaki msg am ayina vasthunda eligible r not ani eligibilty list yepudu release chestaru
Good scems
Age limit tell me
Its takes time came caste certificate and
Where we went and apply the scheme
Age limit unnada sir
0-18
Restion card ledu sir ela mari
Bank joint account india lo ekkadina undocha
Yes . Mi convenience kosam tranfer cheyinchukondi
Hyderabad
I don’t have birth certificate
If not further any problem occurs
dises vishayam equary chestunte teliyada mari
deases vishayam secret ga unchuthara mari equary chestunte mari ade dout mari plz dout clear cheyandi
Father death .Hostel lo unntu chaduvu kunne pillalu eligible karu antunnaru. nijamena sir…
Gud evening sir we need to stamp mother’s income and caste certificate or child income and caste certificate plz give me clarity
amma vodi scheme childs eligible for mission vastalya r not ?
Yes eligible if mother is very poor
Please extend the date for applying
children of our relatives lost both the parents
Father expired last month. They need to get certain documents.
Extended till 26 April
So many people suffering to get all certificates in this least time and also account opening takes times.please increase the date up to this month ending for those people.
Hi
My name is siddu
My father is not have
Nanna చిన్నప్పుడే ఒగ్గేసరూ అమ్మ 10_04_2023 న చనిపోంది మాధి విజయవాడ న చిన్న వయసులో శ్రీకాకుళం జిల్లా రాజం కి వచ్చేశాము prasthutaam నేను రాజం లో చదువుతున్నా నా date of birth certificate ma Amma డెత్ సర్టిఫికెట్ రావడానికి టైం పడుతుంది ప్లీజ్ గివ్ మీ సం టైం
Mi sachivalayam lo contact avvandi. Vallaku mi situation cheppi certificates twaraga process cheyamani cheppandi.
Midi inter complete aite in case part time job kavali ante telegram lo @studybizz_admin ki MSG cheyandi. Maku veelainantha help memu chestam
ఒక ఇంట్లో ముగ్గురు (18సం” లోపు)నలుగురు పిల్లలు ఉంటే ఎంత మందికి ఈ పథకం ద్వారా సహయం అందుతుంది
nee study conduct cerrtificate add chesi ,cast certificate kosam mro office lo apply cheyagalaru ,3days lo birth and cast certificate vastundi .
Age limit change cheste bagundedhi …. Atleast 20 below
Sir reply me sir I am studying in Karnataka eligible or not sir
Amma and nanna expire
Yes eligible
Sir please extend the last date i beg u please reply ..
Sir i am studing in the karnataka school but my document in Andhra I am eligible or not replay me sir
Yes need to extend the date
Sir/Madam,
i am zeenath kounen.please accept my application.
Amma
Who to apply this scheme
Orphans or children left by parents
Babu dad deggara untunadu amma వదిలేసి వెళ్ళిపోయింది eligibility undha pls reply
30 April Sunday, Monday submit cheyoccha
Visit near anganwadi school