రెండో కాన్పు లో ఆడపిల్ల పుడితే 6000 రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ శక్తి ద్వారా కొత్త పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. 2022 ఏప్రిల్ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
ఈ పథకానికి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని సందేహాలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం
మిషన్ శక్తి ప్రశ్నలు సమాధానాలు [ PMMVY FAQ Answers]
Q. మిషన్ శక్తి పథకం ద్వారా రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే 6000 అమౌంట్ ను ఎప్పటినుంచి అమలు చేస్తున్నారు?
ఈ పథకాన్ని 2022 ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నారు.
Q. మొదటి కాన్పు లో మగ బిడ్డ పుట్టి రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే అమౌంట్ ఇస్తారా?
మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టిన మగ బిడ్డ పుట్టినా ప్రధానమంత్రి మాతృ వందన యోజన ద్వారా ఐదువేల రూపాయలను ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు కొనసాగింపుగా మొదటి కాన్పుతో సంబంధం లేకుండా రెండో కాన్పు లో ఆడపిల్ల పుడితే 6000 రూపాయలు పొందవచ్చు.
Q. కవలలు పుట్టి, అందులో ఒక మగ బిడ్డ ఉంటే అమౌంట్ వస్తుందా?
రెండో కాన్పులో కవలలు పుట్టినప్పుడు కనీసం ఒక ఆడబిడ్డ ఉంటే ఆ ఆడబిడ్డకి అమౌంట్ వర్తిస్తుంది.
Q. కవలలు పుట్టినప్పుడు ఇద్దరు ఆడపిల్లలైతే ఇద్దరికీ అమౌంట్ వస్తుందా?
కవలల విషయంలో ఇద్దరు ఆడపిల్లలకి అమౌంటు ఇవ్వరు. కేవలం ఒకరికి 6000 రూపాయలు మాత్రమే ఇస్తారు.
Q. ఈ పథకం కోసం ఎవరిని సంప్రదించాలి?
సాధారణంగా ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం ద్వారా ఏ విధంగా అయితే మొదటి కాన్పు సంబంధించి లబ్ధి పొందుతున్నారో అదే విధంగా ఈ పథకానికి కూడా మీ సమీప ఆశా కార్యకర్తను లేదా మహిళా శిష్ట సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు.
Q. ఈ అమౌంట్ ను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందా?
ఈ పథకానికి అయ్యే ఖర్చును 60:40 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
Leave a Reply