రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్న విద్యార్థులకు రియంబర్స్మెంట్ డబ్బులు జమ చేయడంలో చాలా ఆలస్యం జరుగుతోంది. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ త్వరలో రీయంబర్స్మెంట్ డబ్బులు విడుదలపై నిర్ణయం తీసుకుంటామని ఎక్స్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. అయితే నారా లోకేష్ మరో కీలక ప్రకటన చేశారు.
2024-25 విద్యా సంవత్సరం నుంచి రియంబర్స్మెంట్ డబ్బులు నేరుగా కాలేజీ ఖాతాలకు జమ చేసే పాత విధానాన్ని తిరిగి అమలు చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే గత ప్రభుత్వం పెట్టిన 3500 కోట్ల బకాయిలను కూడా దశలవారీగా చెల్లించనున్నట్టు తెలిపారు.
గత ప్రభుత్వం కాలేజీలకు చెల్లించాల్సిన రియంబర్స్మెంట్ డబ్బులను విద్యార్థుల తల్లిలా ఖాతాలో చెల్లించి తర్వాత విద్యార్థుల తల్లులచే కాలేజీకి చెల్లించే విధానాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని సందర్భాలలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆ డబ్బు లేని ఉపయోగించుకొని కాలేజీకి సరైన సమయాలలో ఫీజు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనేవారు. దీనిని గమనించిన మంత్రి నారా లోకేష్ గతంలో అమలు చేస్తున్న విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు.
సర్టిఫికెట్ జారి మరియు ఇతర అవసరమైన డాక్యుమెంట్ల కు విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను త్వరలో పరిష్కరించడానికి కాలేజీ యాజమాన్యాలతో చర్చించనున్నట్టు తెలిపారు. త్వరలో ఈ విధానాన్ని అమలు చేయడానికి కావలసిన ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలిపారు.
Leave a Reply