బీసీలకు లక్ష పథకానికి సంబంధించి ప్రస్తుతం దరఖాస్తులు కొనసాగుతున్నాయి.. ఈ అప్లికేషన్స్ సొంతంగా ఆన్లైన్ లో గాని లేదంటే మీ సేవలో గాని దరఖాస్తుదారులు అప్లై చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మొదటి రోజు నుంచి దరఖాస్తుదారులు అప్లికేషన్ కి సంబంధించి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనడం జరుగుతుంది.
దరఖాస్తుదారులు ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు
ముఖ్యంగా మీ సేవలో అప్లికేషన్ ఫారం పూర్తయిన తర్వాత సంబంధిత ఫారం ను మున్సిపల్ ఆఫీసులో లేదా ఎంపీడీవో కార్యాలయంలో అందించాలని దరఖాస్తుదారులను పంపించడం జరిగింది. అయితే దీనిపై అసౌకర్యానికి గురైన పలువురు దరఖాస్తుదారులు ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది.
అంతేకాకుండా మొదటి రోజు సజావుగానే సాగిన అప్లికేషన్స్ రెండో రోజు నుంచి సర్వర్ మోరాయించడంతో సబ్మిట్ చేయగానే ఫెయిలవడం వంటి టెక్నికల్ సమస్యలు కూడా ఎదురవడం జరిగింది.
ఈ నేపథ్యంలో మంత్రి గంగుల బీసీలకు లక్ష పథకం కి సంబంధించిన అప్లికేషన్స్ పై క్లారిటీ ఇవ్వడం జరిగింది.
దరఖాస్తుదారులు ఆన్లైన్లో లేదా మీ సేవలో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదని మంత్రి గంగుల క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటివరకు 53 వేల దరఖాస్తులు
ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు 53 వేల దరఖాస్తులు వచ్చాయని, ఇంకా 20వ తేదీ వరకు అవకాశం ఉందని మంత్రి గంగుల తెలిపారు. అర్హత ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని , దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదని ప్రకటించారు.
Leave a Reply