MGNREGA: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. ఏపి తెలంగాణ లో జీతం పెంపు

MGNREGA: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. ఏపి తెలంగాణ లో జీతం పెంపు

జాతీయ ఉపాధి హామీ పథకం లేదా NREGA పథకం వర్కర్ల కు గుడ్ న్యూస్.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించి రోజు వారి వేతనాన్ని సవరించింది. ఈ మేరకు రాష్ట్రాల వారిగా సవరించిన వేతనంతో ఉత్తర్వులు జారి చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎంత వేతనం పెంచారు?

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి 257 నుంచి 272 రూపాయలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేస్తుంది. అంటే దినసరి కూలి 15 రూపాయలు పెంచడం జరిగింది. ఈ వేతనాలు ఏప్రిల్ 1 2023 నుంచి అమలు కానున్నాయి.

రాష్ట్రాల వారిగా సవరించిన రోజు వారి వేతనాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి

  • ఆంధ్ర ప్రదేశ్ – ₹272
  • అరుణాచల్ ప్రదేశ్ – ₹224
  • అస్సాం – ₹238
  • బీహార్ – ₹228
  • చతిస్గడ్ – ₹221
  • గోవా – ₹322
  • గుజరాత్ – ₹256
  • హర్యానా – ₹357
  • హిమాచల్ ప్రదేశ్ – నాన్ షెడ్యూల్ (₹224) షెడ్యూల్డ్ (₹280)
  • జమ్ము కాశ్మీర్ – ₹244
  • లద్ధాక్ – ₹244
  • జార్ఖండ్ – ₹228
  • కర్ణాటక – ₹316
  • కేరళ – ₹333
  • మధ్యప్రదేశ్ – ₹221
  • మహారాష్ట్ర – ₹273
  • మణిపూర్ – ₹260
  • మేఘాలయ – ₹238
  • మిజోరాం – ₹249
  • నాగాలాండ్ – ₹224
  • ఒడిశా – ₹237
  • పంజాబ్ – ₹303
  • రాజస్థాన్ – ₹255
  • సిక్కిం – ₹236 (పలు notified ప్రాంతాల్లో ₹354)
  • తమిళనాడు – ₹294
  • తెలంగాణ – ₹272
  • త్రిపుర – ₹226
  • ఉత్తర ప్రదేశ్ – ₹230
  • ఉత్తరాఖండ్ – ₹230
  • అండమాన్ నికోబార్ – అండమాన్ జిల్లా ₹311 నికోబార్ జిల్లాలో ₹328
  • దాద్రా నగర హవేలీ మరియు డామన్ డయ్యి – ₹297
  • లక్షద్వీప్ – ₹304
  • పుదుచ్చేరి – ₹294

పలుచోట్ల ఇంతకంటే తక్కువ వేతనం కూడా ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వేతనాలు రాష్ట్ర ప్రభుత్వాలు రోజువారీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కేటాయించిన పనిని కూలీలు పూర్తి చేయకపోవడం లేదంటే పెండింగ్ వలన తక్కువ అమౌంట్ కూడా చెల్లిస్తున్నట్లు అధికారులు చెబుతుంటారు అయితే కొన్నిచోట్ల అధికారులు తమ చేతివాటా చూపించి తక్కువ వేతనం చెల్లిస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి.

One response to “MGNREGA: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. ఏపి తెలంగాణ లో జీతం పెంపు”

  1. Allu. Appalanaidu Avatar
    Allu. Appalanaidu

    Ap no cridet 272rs

You cannot copy content of this page