‘మత్స్యకారుల సేవలో’ పేరుతో మత్స్యకారులకు ఆర్థిక సాయం పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.259 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
దేశంలో ఉత్పత్తయ్యే మత్స్య సంపదలో 29శాతం ఏపీ నుంచే ఉంటుంది. మత్స్య ఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. మత్స్యకారుల పిల్లల్ని బాగా చదివించే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే 6 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశాం. ఎచ్చర్లలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాం. స్థానిక ఉద్యోగాలు ఈ ప్రాంత వాసులకే వచ్చేలా చర్యలు తీసుకుంటాం’’ అని చంద్రబాబు అన్నారు.
వేట నిషేధం ఉన్న నేపథ్యంలో ₹ 20,000 చొప్పున ఆర్థిక సాయం విడుదల.
ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 16 వ తేదీ వరకు అంటే 61 రోజుల పాటు చేపల వేట పై నిషేధం.
Leave a Reply