UPI ఉపయోగించి ఫోన్ పే, గూగుల్ పే, లేదా పేటియం తదితర యాప్ ల ద్వారా పేమెంట్లు చేసేటటువంటి లబ్ధిదారులకు గుడ్ న్యూస్. మీ బ్యాంక్ ఖాతాలో నగదు లేదా నగదు తక్కువ ఉందా? అయినా ఇప్పుడు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇకపై క్రెడిట్ కార్డు ఉపయోగించి కూడా మీరు చక్కగా యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం
11 బ్యాంకులు ద్వారా UPI సౌకర్యంతో రూపే క్రెడిట్ కార్డులు
Unified Payment Interface UPI, డిజిటల్ పేమెంట్ వ్యవస్థల విప్లవం తీసుకొచ్చినటువంటి ఈ యుపిఐ ప్రస్తుతం ప్రతి చోటా వినియోగంలో ఉంది. కూరగాయలు టీ షాప్, మొదలుకొని భారీ నగదు పేమెంట్ ల వరకు కూడా చక్కగా బ్యాంక్ ఖాతా నుంచి మీ అమౌంటును యూపీఐ ద్వారా పంపించే సౌకర్యం ఉంది.
అయితే ఈ వ్యవస్థ తీసుకొచ్చిన మొదటి దశలో బ్యాంక్ ఖాతాను మాత్రమే మనం లింక్ చేసుకునే సౌకర్యం ఉండేది. తద్వారా మన బ్యాంక్ ఖాతాలో అమౌంట్ ఉంటేనే upi ద్వారా చెల్లించే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం మన బ్యాంక్ ఖాతాలో అమౌంట్ లేకపోయినా సరే చక్కగా క్రెడిట్ కార్డు ఉపయోగించి మన యూపీఐ పేమెంట్లు వెంటనే చేసేసుకోవచ్చు. అయితే ఇందుకోసం రూపే క్రెడిట్ కార్డు తప్పనిసరి.
దేశీయంగా డిజిటల్ చెల్లింపులను బలోపేతం చేసేందుకు తీసుకువచ్చినటువంటి రూపే క్రెడిట్ కార్డ్ ను యూపీఐ యాప్ లకు సులభంగా లింక్ చేసి చెల్లింపులు చేసుకునే సదుపాయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించింది.
ప్రస్తుతం 11 బ్యాంకులు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి
UPI చెల్లింపులు చేసుకునే వీలున్నటువంటి రూపే క్రెడిట్ కార్డులను ప్రస్తుతం 11 బ్యాంకులు అందిస్తున్నాయి.
వీటిలో దిగ్గజ బ్యాంకులు అయినటువంటి HDFC, ICICI మరియు ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కూడా ఈ రూపే కార్డులను అందిస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెలలో రూపే క్రెడిట్ కార్డును యూపీఐ ఆధారిత సేవలకు వినియోగించుకునే సదుపాయాన్ని తమ కస్టమర్లకు కల్పించడం జరిగింది.
11 banks support UPI Payments via Rupay Credit Cards
UPI సౌకర్యం ఉన్నటువంటి రూపే కార్డులు జారీ చేస్తున్నటువంటి బ్యాంకుల జాబితా ఇదే
- యాక్సిస్ బ్యాంకు రూపే క్రెడిట్ కార్డ్
- బ్యాంక్ ఆఫ్ బరోడా రూపే కార్డు
- కెనరా బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్
- HDFC బ్యాంకు రూపే క్రెడిట్ కార్డ్
- ఐసిఐసిఐ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్
- ఇండియన్ బ్యాంకు రూపే క్రెడిట్ కార్డ్
- కోటక్ మహీంద్రా బ్యాంకు రూపే క్రెడిట్ కార్డ్
- పంజాబ్ నేషనల్ బ్యాంకు రూపే క్రెడిట్ కార్డ్
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బిఐ రూపే క్రెడిట్ కార్డ్
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపే క్రెడిట్ కార్డ్
- ఎస్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్
దేశీయంగా రూపొందిన రూపే ప్లాట్ ఫారం పై లావాదేవీలను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో యూపీఐ పేమెంట్ లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెసులుబాటును కల్పించడం జరిగింది.
రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా కలిగే ప్రయోజనాలు
క్రెడిట్ కార్డు ద్వారా కలిగేటటువంటి ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
✓ బ్యాంక్ ఖాతాలో నగదు లేకుండానే యూపీఐ చెల్లింపులు
✓ క్రెడిట్ కార్డు రూపంలో కూడా చెల్లింపులు చేసుకునే సదుపాయం
✓ చేసిన నగదు చెల్లింపులకు ఆయా బ్యాంకుల ద్వారా క్యాష్ బ్యాక్ లేదా రివార్డులు కూడా పొందే అవకాశం
✓ ఇతర క్రెడిట్ కార్డు ల వలె ఈ క్రెడిట్ కార్డులకు కూడా బిల్లింగ్ సైకిల్ 28 నుంచి 32 వరకు ఉంటుంది. ఈ వ్వవధి లో మీరు వాడుకున్న మొత్తాన్ని పేమెంట్ డ్యూ డేట్ లోపు ఎటువంటి వడ్డీ లేకుండా చెల్లించవచ్చు. మీ స్టేట్ మెంట్ జెనరేట్ అయిన తరువాత మీకు చెల్లింపుకు అదనంగా మరో 15 నుంచి 20 రోజుల గడువు ఉంటుంది. మొత్తంగా 45 నుంచి 50 రోజుల లోపు ఆయా బ్యాంకులు తమ కార్డుల పేమెంట్ ను ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా చెల్లించే వెసులు బాటు కల్పిస్తాయి. ఈ వ్యవధి బ్యాంక్ ను బట్టి మారుతుంది.
కాకపోతే ఈ రూపే క్రెడిట్ కార్డులను ఉపయోగించి మీరు ఇతర క్రెడిట్ కార్డు బిల్లులను యూపీఐ పద్ధతిలో చెల్లించే సౌకర్యం అయితే ఉండదు. ఎందుకంటే ఇది కూడా ఒక క్రెడిట్ కార్డు కాబట్టి మరొక క్రెడిట్ కార్డు బిల్లును మీరు ఈ క్రెడిట్ కార్డు తో చెల్లించే అవకాశం ఉండదు. అయితే చక్కగా అన్ని యూపీఐ లావాదేవీలను మరియు చెల్లింపులను బ్యాంక్ ఖాతా యూపీఐ మాదిరిగానే ఈ రూపే క్రెడిట్ కార్డు ద్వారా కూడా చేసుకోవచ్చు.
గమనిక: ఈ ఆర్టికల్ లబ్ధిదారుల అవగాహన కోసం మాత్రమే. మీకు రూపే క్రెడిట్ కార్డు కావాలన్నా లేదా ఇతర షరతుల కొరకు సంబంధిత బ్యాంకు ను సంప్రదించండి. ధన్యవాదాలు
Leave a Reply