MSSC Scheme: ఎక్కువ వడ్డీ తక్కువ అమౌంట్ తో మహిళల కోసం మరో కొత్త పథకం..మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్

MSSC Scheme: ఎక్కువ వడ్డీ తక్కువ అమౌంట్ తో మహిళల కోసం మరో కొత్త పథకం..మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రకటించిన విధంగా మహిళలు, బాలికల కోసం తీసుకువచ్చిన చిన్న మొత్తాల పొదుపు పథకం “మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్”.. ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలు లోకి వచ్చింది.

ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల అయింది. దేశవ్యాప్తంగా 1.59లక్షల పోస్టాఫీసుల్లో ఈ పథకాన్ని తక్షణమే అందుబాటులోకి తెస్తున్నట్లు అందులో పేర్కొంది.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అంటే ఎంటి ? అర్హతలు

Mahila Samman Savings Certificates – ఈ పథకం ద్వారా మహిళలు లేదా బాలికల పేరుమీద రెండు లక్షల వరకు గరిష్ట పరిమితితో డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ పథకాన్ని 2023 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు రెండేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచనుంది.

కేవలం మహిళలు లేదా బాలికలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

ఎంత వడ్డీ చెల్లిస్తారు? ఎంత డిపాజిట్ చేయొచ్చు

ఈ పథకానికి 7.50% fixed వడ్డీ రేటును ప్రభుత్వం ప్రకటించింది. గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసే వీలు ఉంది. రెండేళ్ల గడువు ఈ డిపాజిట్ కి ఉంటుంది.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఎలా ఓపెన్ చేయాలి?

ప్రస్తుతం పోస్ట్ ఆఫీసులలో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

మీ దగ్గర లోని పోస్టాఫీసును (Post Office) సందర్శించి మహిళా సమ్మాన్‌ బచత్‌ పత్ర యోజన ఫారంను అడిగి తీసుకోవాలి.

మీ వ్యక్తిగత వివరాలు, ఆర్థిక, నామినేషన్‌ వివరాలను నింపి దరఖాస్తు పూర్తి చేయాలి.

గుర్తింపు (identity), చిరునామా(address) ప్రూఫ్ కోసం ఆధార్‌, పాన్‌ వంటి పత్రాలను Xerox తెసి దరఖాస్తు ఫారంతో జత చేయాలి.l.

ఎంత డిపాజిట్ చేస్తున్నారో ఆ మొత్తాన్ని ఎంచుకుని, నగదు లేదా చెక్కు ద్వారా డిపాజిట్‌ చేసుకోవచ్చు.

మీరు పెట్టిన డిపాజిట్ కి సంబందించి మీకు రుజువుగా ఒక సర్టిఫికెట్‌ను ఇస్తారు. అది తీసుకోవాలి.

ఈ పథకం కి సంబంధించి మీరు చేసిన లావాదేవీ కి గాను మీకు కాగిత రూపంలో రసీదు కావాలంటే రూ.40 ఛార్జిని వసూలు చేస్తారు. ఇ-మోడ్‌లో కావాలనుకుంటే రూ.9 చెల్లిస్తే చాలు.

ఏడాది తర్వాత పాక్షికంగా (Partial withdrawal) నగదు ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. డిపాజిట్‌ మొత్తంలో 40శాతం వెనక్కి ఇస్తారు.

Mahila Samman Certificate

అయితే గడువు పూర్తి అవ్వకముందే ఖాతాను మూసివేసే ఆప్షన్ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఉంటుంది. ఖాతాదారు చనిపోయినా లేదా తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతుంటే ఖాతాను ముందస్తు రద్దు(pre close) చేసుకోవచ్చు. అయితే, ఖాతాను ప్రారంభించి ఆరు నెలలు అయినా పూర్తవ్వాలి.

You cannot copy content of this page