AP LRS 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 30 జూన్ 2025 వరకు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల రెగ్యులరైజేషన్ కొరకు ప్రభుత్వం సవరించిన ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ [Land Regularization Scheme] జీవో ను జూలై 26న విడుదల చేసింది.
లేఅవుట్ రెగ్యులరైజేషన్ [LRS] అంటే ఏమిటి
రాష్ట్రంలో కొంతమంది వివిధ ప్లాట్లను లేదా వ్యవసాయ భూములను కొని వాటిని కలిపి ఒక లేఅవుట్గా అభివృద్ధి చేస్తారు. వీటిని లేఔట్ పేరుతో అమ్మకాలు చేయటం లేదా భవిష్యత్తులో ఇల్లు నిర్మించడం వంటివి చేస్తారు. కానీ వీటన్నిటికీ ప్రభుత్వం ద్వారా రెగ్యులరైజేషన్ అవసరం. అలా చేయని వాటికి ప్రస్తుతం విడుదల చేసిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా రెగ్యులరైజేషన్ చేసే వీలు ఉంటుంది. అంటే క్లుప్తంగా అనధికారిక లేదా అక్రమ లేఔట్లను రిజిస్టర్ చేయటం మరియు వాటికి అనుమతులు ఇవ్వడం వంటివి ఇందులో భాగం.
LRS బెనిఫిట్స్ ఏంటి
ఏ లేఔట్ లో ప్లాట్ మీరు కొనాలన్నా తప్పనిసరిగా ఆ లేఔట్ కి చట్టబద్ధత ఉండాలి. అది లేకుండా కొంటే భవిష్యత్తులో ప్రయావిక్రయాలకు ప్రాబ్లం అవుతుంది. చట్టబద్ధత మరియు క్రయ విక్రయాలకు అనుమతి LRS రెగ్యులరైజేషన్ ద్వారా లభిస్తుంది.
LRS AP 2025 ముఖ్యాంశాలు
AP LRS 2025: లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీం రూల్స్ ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. 2025 జూన్ 30 వరకు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు రెగ్యులరైజేషన్ (LRS) కు ప్రస్తుతం అర్హత ఉంది.
- LRS అప్లికేషన్ కోసం 90 రోజులు గడువు ఇవ్వడం జరిగింది.
- అప్లికేషన్లు 26 జూలై 2025 నుంచి 90 రోజుల పాటు ఓపెన్ లో ఉంటాయి. కొత్త అప్లికేషన్స్కు ఆగస్టు ఒకటి నుంచి అవకాశం.
- ప్రతి చట్టబద్ధత లేని లేఅవుట్ ప్లాట్ కి తప్పనిసరిగా అప్లై చేయాలి.
- ప్లాట్ రిజిస్ట్రేషన్ లేదా అమ్మకం తేదీ కట్ ఆఫ్ – 30-06-2025 లోపు అయి ఉండాలి.
- ప్లాట్ విలువ ఆధారంగా ఛార్జీలు ఉంటాయి.
- 10% ఓపెన్ స్పేస్ లేకపోతే – 14% అదనపు ఛార్జీలు.
- LRS regularisation కోసం లబ్ధిదారులు సమీప సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సంప్రదించవచ్చు.
గతంలో పెండింగ్ లో ఉన్న LRS అప్లికేషన్స్ పై క్లారిటీ
గతంలో ఎల్ఆర్ఎస్ కు సంబంధించి క్రమబద్ధీకరణ కు దరఖాస్తు చేసుకొని వివిధ కారణాలతో పెండింగ్లో పెట్టిన లేదా మరిన్ని వివరాల కోసం తిరిగి పంపించిన దరఖాస్తులకు సంబంధించి ప్రస్తుతం క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. పెండింగ్ డేటా సమర్పించి సదరు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుడు ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. గతంలో 18 వేల అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నట్టు సమాచారం.
అయితే గతంలో ఫీజులు చెల్లించి వివిధ డేటా కారణాల వలన పెండింగ్ ఉన్నటువంటి వాటిని ప్రస్తుతం తిరిగి సవరించిన ఫీజు చెల్లించమంటే మాత్రం కష్టం అవుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు.
ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి
LRS అప్లికేషన్ జూలై 26 నుంచి 90 రోజులపాటు ఓపెన్ లో ఉంటుంది. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న వాటిని క్రమబద్ధీకరిస్తున్నారు. కొత్త అప్లికేషన్స్ ఆగస్టు ఒకటి నుంచి తీసుకుంటారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ ఇవ్వబడిన నెంబర్ కి పని వేళల్లో సంప్రదించవచ్చు. 7981651881 (Monday – Friday from 10 AM to 5.30 PM
|ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు క్లిక్ చేయండి.
Leave a Reply