దేశవ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగారుల పై మరోసారి భారం పడింది.
గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
అటు గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పిజి సిలిండర్ మరియు వాణిజ్య సిలిండర్ రెండిటిపై మరోసారి భారం మోపడం జరిగింది.
తాజా నిర్ణయంతో గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు , వాణిజ్య సిలిండర్ పై 350.5 రూపాయలు బాదడం జరిగింది.
ఇప్పటికే అధిక ధరల తో సతమతమవుతున్న సామాన్యుల కు ఈ నిర్ణయం మరింత ఆర్థిక భారం కానుంది.
తాజా నిర్ణయం తో హైదరాబాద్ లో 1105 రూపాయలు ఉన్న సిలిండర్ ధర 1155 కానుంది.
ఏపి లో 1070 నుంచి 1119.5 మధ్యలో ధరలు ఉండగా వాటిపై అదనంగా 50 రూపాయలు పెరగనుంది.
ఇక వాణిజ్య సిలిండర్ వాడే వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. 19 కేజీ ల సిలిండర్ 1800 వరకు ఉండగా, ఇకపై దాని పై అదనంగా 350.5 రూపాయలు పెంచనున్నారు.
Leave a Reply