గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ముఖ్య గమనిక. సిలిండర్ తీసుకున్న ప్రతిసారి డెలివరీ బాయ్ కి అదనంగా డబ్బులు చెల్లిస్తున్నారా ? అయితే ఇక ఆపేయండి. అసలు ఎంత దూరం లో డీలర్ ఉంటె ఎంత చెల్లించాలి ? చార్జీలు అడిగితె ఎవరిని సంప్రదించాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి
ప్రస్తుతం వినియోగదారుల నుంచి అదనంగా ₹30 నుంచి ₹50 రూపాయలు వసూలు చేస్తున్నారు. సిలిండర్ ధర కన్నా ఇది అదనం. ఆన్లైన్ లో డబ్బులు చెల్లించిన వారి నుంచి కూడా ఈ చార్జీలు వసూలు చేస్తున్నారు.
గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేసే వారికి అదనంగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపీ పౌర సరఫరాల శాఖ తెలిపింది
సంబంధిత డిస్ట్రిబ్యూటర్లు సిలిండర్ ను ప్రజలకు ఉచితంగా చేర్చాల్సి ఉంటుంది. ఈ చార్జీలు వినియోగదారులు చెల్లించే బిల్లులోనే ఉంటుంది. అంటే సీలిండర్ ధర లో నే ఇది కూడా ఉంటుంది.
కాబట్టి అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని ఇప్పటికే HPCL చీఫ్ జనరల్ మేనెజర్ నరసింహ కూడా గతం లో తెలిపారు
గ్యాస్ డీలర్ దూరం ను బట్టి ఫీజు వివరాలు
Gas Dealer Distance | Charges to be collected |
0-5 KM distance | 0 [Nil] |
5-15 KM distance | 20 Rupees |
above 15 KM | 30 Rupees |
LPG Cylinder Delivery Charges Complaint Number
ఏవరైనా వినియోగదారుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తే కింది నంబర్లకు పిర్యాదు చేయవచ్చు.
AP Govt Customer Care : 1967 or 18002333555
or
నేరుగా గ్యాస్ ఏజెన్సీ కస్టమర్ కేర్ నుంబర్ కి కాల్ చేసి పిర్యాదు చేయవచ్చు
Indane Gas Customer care Toll Free No. 1800 233 3555
Bharat Gas Customer care number : 1800 22 4344
HP Gas Toll Free Number: 1800 2333 555
Leave a Reply