లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతిభవంతులైనటువంటి విద్యార్థుల ఉన్నత చదువులకు తోడ్పాటు అందించేందుకుగాను, ఎల్ఐసి కొత్త స్కాలర్షిప్ పథకాన్ని తీసుకువచ్చింది. LIC Golden Jubilee Scholarship 2024 పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తుంది.
ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీహిల్స్ స్కాలర్షిప్ 2024 అర్హతలు
దేశవ్యాప్తంగా 2021-22, 2022-23 లేదా 2023-24 విద్యా సంవత్సరంలో కనీసం 60% లేదా తత్సమాన CGPA గ్రేడ్‌తో Xth / XIIth / డిప్లొమా చదివినటువంటి విద్యార్థులకు ఉన్నత చదువులు చదివేందుకు ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది.
(i) మెడిసిన్, ఇంజినీరింగ్, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, ఏదైనా రంగంలో డిప్లొమా కోర్సు లేదా ఇంటిగ్రేటెడ్ కోర్సులు చేయాలనుకునే బాల బాలికులకు ఈ స్కాలర్షిప్ అందిస్తారు.
(ii) ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/ ఇన్‌స్టిట్యూట్‌లు లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో (ITI) కోర్సుల ద్వారా వృత్తిపరమైన కోర్సులు చేసేవారు ఇందుకు అర్హులు
పైన పేర్కొన్న స్కాలర్షిప్ తో పాటు స్పెషల్ స్కాలర్షిప్ పేరుతో బాలికలకు రెండేళ్లపాటు స్కాలర్షిప్ అందించే పథకాన్ని కూడా ఎల్ఐసి ప్రారంభించింది.
ఈ రెండవ స్పెషల్ స్కాలర్షిప్ పథకం లో భాగంగా పదో తరగతి ఇంటర్మీడియట్ లేదా డిప్లమో కోర్స్ చదివేటటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తారు.
ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2024 అప్లికేషన్ ప్రక్రియ
Lic golden jubilee scholarship 2024 అప్లికేషన్ ప్రక్రియ డిసెంబర్ 7 నుంచి ప్రారంభమవుతుంది.
అర్హత ఉన్నటువంటి విద్యార్థులు https://licindia.in అధికారిక వెబ్సైట్ కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 22.12.2024.
Leave a Reply