ప్రైవేట్ రంగంలో ఉద్యోగులుగా పని చేస్తున్నటువంటి వారికి ఆదాయ పన్ను శాఖ CBDT గుడ్ న్యూస్ తెలిపింది.
ప్రైవేటు ఉద్యోగులకు సాధారణంగా పదవీ విరమణ అంటే రిటైర్మెంట్ సమయంలో వారికి మిగిలి ఉన్నటువంటి లీవ్స్ ను ఎంక్యాష్ అంటే నగదు రూపంలో పొందడం జరుగుతుంది.
అయితే ఈ leave encashment అమౌంట్ పై గతంలో పన్ను విధించే లిమిట్ మూడు లక్షలు ఉండగా ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ ఏకంగా 25 లక్షలకు పెంచుతూ భారీ ఉపశమనాన్ని కల్పించింది. అంటే సదరు ఉద్యోగి 25 లక్షల వరకు పొందేటటువంటి లీవ్ ఎన్కాష్మెంట్ లో భాగంగా ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆదాయపు పన్ను చట్టం (10AA) of section 10 of the Income-tax Act లో భాగంగా ఈ సవరణలు చేసినట్లు CBDT బుధవారం ఒక ప్రకటనలో భాగంగా వెల్లడించింది.
ఈ సవరించిన రూల్స్ ఏప్రిల్ 1 2023 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.
దీంతో ప్రైవేట్ ఉద్యోగులు తమ రిటైర్మెంట్ (superannuation or otherwise) సమయంలో పొందే లీవ్ ఎన్కాష్మెంట్ ద్వారా 25 లక్షలు వరకు ఎటువంటి పనులు లేకుండా తమ ఖాతాలోకి పొందవచ్చు.
Leave a Reply