LRS: అక్రమ లేఔట్ల లో ప్లాట్ కొన్నారా? అయితే ఈ అవకాశం మీకోసం

LRS: అక్రమ లేఔట్ల లో ప్లాట్ కొన్నారా? అయితే ఈ అవకాశం మీకోసం

రాష్ట్రవ్యాప్తంగా లేఅవుట్ పేరుతో పలు ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ల స్థలాలను అమ్మటం మనం చూస్తూ ఉంటాం. అయితే వాటికి సరైన అనుమతులు ఉన్నాయా లేవా అనేది మనం తెలుసుకుంటున్నామా?  తెలుసుకోకుండా ప్లాట్ కొనేస్తే పరిస్థితి ఏంటి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. తెలియకుండా అక్రమ లేఔట్ లో ప్లాట్ కొన్నవారు తర్వాత ఆ ఇంటికి సంబంధించిన నిర్మాణానికి అధికారుల అనుమతుల కోసం వెళితే వారికి చేదు అనుభవం ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వారికి మరియు లేఔట్లలో ఫ్లాట్ అమ్మిన వారికి లీగల్ ఫైట్ ఏళ్ల తరబడి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వారందరికీ ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పించింది. అక్రమ లే అవుట్ లలో ప్లాట్ కొన్న వారికి రెగ్యులరైజ్ చేసేందుకు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం తీసుకురావడం జరిగింది.

లేఔట్ రెగ్యులరైజేషన్ పథకం ద్వారా ప్లాట్ ను ఎలా క్రమబద్ధకరించుకోవాలి?

లేఔట్ లో స్థలం కొన్నట్టు సరైన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటే చాలు, ఇది అప్లోడ్ చేసి మీరు ఆన్లైన్ ద్వారా అయినా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్ పద్ధతిలో అయితే సబ్ రిజిస్టార్ కార్యాలయంలో లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ LTP వారి లాగిన్ లో ఆయన మీరు దరఖాస్తు చేయవచ్చు.

లేఅవుట్ రెగ్యులరైజేషన్ రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసేందుకు లింక్ కింద ఇవ్వబడింది. ఇందులో citizen login అనే ఆప్షన్ ఎంచుకోండి.

పైన ఇవ్వబడిన లింక్ లో రిజిస్టర్ అయి లాగిన్ అయిన తర్వాత మీరు మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అదేవిధంగా లేఅవుట్ కాపీ అప్లోడ్ చేయవచ్చు. సంబంధిత అధికారులు ఆ లేఔట్ కి సంబంధించిన భూమిని పరిశీలించి అనుమతులు జారీ చేయడం జరుగుతుంది.

Online link for LRS in AP

లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ LRS ఎప్పటి లోగా దరఖాస్తు చేసుకోవచ్చు

LRS పథకం కింద దరఖాస్తు చేసుకునేవారు అక్టోబర్ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే జూన్ వరకు రిజిస్టర్ అయినటువంటి ప్లాట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

LRS Application last date in Andhra Pradesh: 31 October  2025

LRS Application plot cut off date  in Andhra Pradesh: 30 June 2025 (plots registered on or before this date)

LRS పథకం కింద దరఖాస్తు చేసుకునే వారికి పది నుంచి 14 శాతం వరకు ఫీజు ఉంటుంది.

ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ఎలా చేస్తారు

క్రమబద్ధీకరణలో భాగంగా దరఖాస్తు అందిన తర్వాత పుర నగరపాలక సంస్థ వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి చుట్టుపక్కల వారిని విచారించి ఎటువంటి అభ్యంతరాలు లేకపోతే లేఔట్ కి సంబంధించిన ఫ్లాట్ క్రమబద్ధీకరణ చేయడం జరుగుతుంది.

మరిన్ని వివరాలకు LRS HELPLINE కి సంబంధించిన ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ పై సంప్రదించవచ్చు: 7981651881 [సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు అందుబాటులో ఉంటారు]

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page