రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అక్కాచెల్లెళ్లకు, ఆడపడుచులకు గుడ్ న్యూస్ అందించిన విషయం తెలిసిందే. గృహ వినియోగానికి ఉపయోగించేటటువంటి 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ పై ఏకంగా 200 రూపాయలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
అటు ఉజ్వల పథకం కింద లబ్ధి పొందుతున్న వారికి అదనంగా 200 రూపాయలు అంటే మొత్తంగా 400 రూపాయల తగ్గింపు వర్తిస్తుంది.
తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా 33 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని కేంద్ర సమాచార మరియు ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
ఆగస్టు 30 నుంచి ప్రస్తుతం తగ్గించిన ధరలు తక్షణమే అందుబాటులోకి వచ్చాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ల పై ఈ ₹200 రాయితీ వర్తిస్తుంది. వీరీతో పాటు PMUY ద్వారా సిలిండర్ పొందిన అందరికీ 14.2 కేజీల గృహ సిలిండర్ల పై ₹400 రాయితీ వర్తిస్తుంది.ఏడాది కి 12 సిలిండర్ల వరకు ఈ రాయితీ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే తగ్గించిన ధరలు దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం జరిగింది.
తాజా తగ్గింపుతో తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి
హైదరాబాద్ నగరంలో సిలిండర్ ధర ₹1155 రూపాయలుగా ఉండగా 200 రూపాయలు తగ్గింపు తో ప్రస్తుతం 955 రూపాయలకే సిలిండర్ లభిస్తుంది.
విజయవాడ సహా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి. 1105 రూపాయలుగా ఉన్నటువంటి సిలిండర్ ధర ప్రస్తుత తగ్గింపుతో 905 రూపాయలకే వినియోగదారులకు లభిస్తుంది.
విశాఖపట్నంలో 1112 రూపాయలుగా ఉన్నటువంటి సిలిండర్ ధర సవరించిన ధరలతో 912 కే లభిస్తుంది.
ఇక ఉజ్వల కింద లబ్ధి పొందుతున్న వారి కైతే 705 రూపాయలకే సిలిండర్ ఇంటికి రానుంది.
దేశ రాజధానిలో ప్రస్తుతం 1103 రూపాయలు వసూలు చేస్తుండగా ఇకపై సిలిండర్ 903 రూపాయలకే లభించనుంది.
ప్రముఖ నగరాలలో ఈ విధంగా ఉన్నాయి
Cylinder Price Delhi – ₹903
Cylinder Price Mumbai – ₹902.5
Cylinder Price Kolkata – ₹929
Cylinder Price Hyderabad – ₹955
Cylinder Price Chennai – ₹918
Cylinder Price Vijayawada – ₹905
Cylinder Price Visakhapatnam – ₹912
ఐదు రాష్ట్రాల ఎన్నికలు మరియు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెరుగుతున్న అధిక సిలిండర్ ధరల నుంచి ఊరట కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
For More Updates Join us on Telegram
Leave a Reply