సంగారెడ్డి జిల్లా కొల్లూరు లో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయమైనటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
60 వేల మంది ఒకే చోట ఉండేలా అతిపెద్ద టౌన్షిప్
ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాజెక్టులో అతిపెద్ద దైన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాజెక్టు ను కెసిఆర్ ప్రారంభించడం జరిగింది. స్వయంగా ఆరుగురు లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పత్రాలను అందించడం జరిగింది.
కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఇవే [Kollur Double Bedroom specialities]
ఒకే చోట 60 వేల మంది నివాసం ఉండేలా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. మొత్తం 15,660 ఇళ్లను ఈ ప్రాజెక్టు కింద నిర్మించడం జరిగింది. పేదల కోసం అన్ని సౌకర్యాలతోటి ఈ ఆదర్శ టౌన్షిప్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడం జరిగింది.
145 ఎకరాల భారీ విస్తీర్ణంలో మొత్తం 117 బ్లాకుల్లో ఈ అతి పెద్ద గృహ సముదాయాన్ని ప్రభుత్వం నిర్మించింది.ఒక్కో ఇంటిని 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టడం జరిగింది.
ఈ భవనాలను జీ+9, జీ+10, జీ+11 అంతస్తుల్లో భారీ స్థాయిలో నిర్మించారు. మొత్తం విస్తీర్ణంలో 37 శాతం భూమి లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించగా.. మిగిలిన 63 శాతం భూమి మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం కేటాయించింది. ఈ కాంప్లెక్స్‌లో ఎస్+9లో 38 బ్లాక్‌లు, ఎస్+10లో 24 బ్లాక్‌లు, ఎస్+11లో 55 బ్లాక్‌లు.. మొత్తం 117 బ్లాకుల తో భారీగా ఈ గృహ సముదాయాన్ని ప్రభుత్వం నిర్మించడం జరిగింది.
Leave a Reply