రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 ఖరీఫ్ సీజన్‌కు గాను వివిధ పంటలకు కనీస మద్దతు ధర (MSP) పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేర నిర్ణయం తీసుకుంది. ఒక క్వింటాల్ సాధారణ వరికి మద్దతు ధరను ఏకంగా రూ.143 చొప్పున పెంచడం జరిగింది. దీంతో క్వింటాల్ సాధారణ వరి రకం ధర రూ.2,183కి చేరింది. అలాగే, గ్రేడ్ -ఎ వరికి రూ.163లు పెంచడంతో క్వింటాల్ ధర రూ.2203కి చేరింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కనీస మద్దతు ధరలను అధికంగా పెంచినట్టు కేంద్రం తెలిపింది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన తరుణంలో ఎంఎస్‌పీ పెంచడం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.
2023-24 కనీస మద్దతు ధరలు ఇవే
2023 24 ఖరీఫ్ సీజన్ కి సంబంధించిన కనీస మద్దతు ధరలను కింది పట్టికలో చూడవచ్చు
Crops | MSP 2014-15 | MSP 2022-23 | MSP 2023-24 | Cost* KMS 2023-24 | Increase in MSP over 2022-23 |
Paddy -Common | 1360 | 2040 | 2183 | 1455 | 143 |
Paddy-Grade A^ | 1400 | 2060 | 2203 | – | 143 |
Jowar-Hybrid | 1530 | 2970 | 3180 | 2120 | 210 |
Jowar- Maldandi^ | 1550 | 2990 | 3225 | – | 235 |
Bajra | 1250 | 2350 | 2500 | 1371 | 150 |
Ragi | 1550 | 3578 | 3846 | 2564 | 268 |
Maize | 1310 | 1962 | 2090 | 1394 | 128 |
Tur /Arhar | 4350 | 6600 | 7000 | 4444 | 400 |
Moong | 4600 | 7755 | 8558 | 5705 | 803 |
Urad | 4350 | 6600 | 6950 | 4592 | 350 |
Groundnut | 4000 | 5850 | 6377 | 4251 | 527 |
Sunflower Seed | 3750 | 6400 | 6760 | 4505 | 360 |
Soybean (Yellow) | 2560 | 4300 | 4600 | 3029 | 300 |
Sesamum | 4600 | 7830 | 8635 | 5755 | 805 |
Nigerseed | 3600 | 7287 | 7734 | 5156 | 447 |
Cotton (Medium Staple) | 3750 | 6080 | 6620 | 4411 | 540 |
Cotton (Long Staple)^ | 4050 | 6380 | 7020 | – | 640 |
ముఖ్యమైన పంటల మద్దతు ధరలు ఇలా
ఈసారి పెసర పంటకు అత్యధికంగా కనీస మద్దతు ధరను పెంచారు. గతేడాది క్వింటాల్ ధర రూ.7,755లు ఉండగా.. ఈసారి 10.4శాతం పెంచడంతో పెసరకు మద్దతు ధర రూ.8,558కి పెరిగింది. అలాగే, హైబ్రిడ్ జొన్న క్వింటాల్ రూ.3180, జొన్న(మాల్దండి), రూ.3225, రాగి రూ.3846, సజ్జలు రూ.2500, మొక్కజొన్న రూ.2090, పొద్దుతిరుగుడు(విత్తనాలు) రూ.6760, వేరుశెనగ రూ.6377, సోయాబీన్ (పసుపు పచ్చ) రూ.4600, పత్తి(మధ్యస్థాయి పింజ) రూ.6620, పత్తి (పొడవు పింజ) రూ. 7020 చొప్పున ఈ సీజన్‌లో ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది.
MSP ధరలకు సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ కోసం కింది లింక్ చెక్ చేయండి
Leave a Reply