గత ప్రభుత్వా హయంలో మధ్యతరగతి వారికి ప్లాట్లు అందించే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ పథకాన్ని MIG లేఅవుట్లు / NTR స్మార్ట్ టౌన్షిప్ పేరుతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలుసిందే.
మద్యతరగతి ప్రజల కోసం అభివృద్ధి చేసిన ఈ హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది.
స్మార్ట్ టౌన్షిప్ ఎంఐజి లేఔట్ ల కొత్త గైడ్లైన్స్ ఇవే
- ఈ ప్లాట్ లకు సంబంధించి కొత్త అప్లికేషన్ల స్వీకరణ నిలిపివేత.
- ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులపై వెంటనే లాటరీ ద్వారా కేటాయింపు.
- లబ్ధిదారులకు కేటాయించగా మిగిలిన ప్లాట్లు కామర్షియల్ వేలం ద్వారా విక్రయం చేయనున్న ప్రభుత్వం.
- అసలు ప్రారంభం కాని ప్రాజెక్టులను కమర్షియల్ హౌసింగ్ లేఅవుట్లుగా అభివృద్ధి.
- సంబంధిత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలUDAs నిబంధనల ఈ ప్రకారం ప్రక్రియ కొనసాగుతుంది.
ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ లపై ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలపై దృష్టి
ఇప్పటి వరకు మొత్తం 74 ప్రాజెక్టులు వివిధ నగరాల్లో ప్రారంభించగా కేవలం 36 మాత్రమే ప్రారంభమయ్యాయి. మిగిలిన 38 ప్రాజెక్టుల్లో పనులు వివిధ దశల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేటాయించిన ప్రాజెక్టులలో కూడా చాలా వరకు స్థలాలు ప్లాట్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని ప్రభుత్వం పరిశీలించి ఆయా పురపాలక సంఘాల నిబంధనల మేర వీటిని వేలంలో అమ్మాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం అప్లికేషన్లను కూడా నిలిపివేసింది.
Leave a Reply