తెలంగాణలో ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించలాన్ని సంకల్పంతో ముందుకెళ్తున్న కేసీఆర్ సర్కారు.. ఈసారి విద్యార్థుల కోసం సరికొత్త పథకాన్ని.. దసరా కానుకగా ప్రారంభించనున్నారు. అక్టోబర్ 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులకు “ముఖ్యమంత్రి అల్పాహార పథకం” ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్న ప్రభుత్వం.. ఈ పథకంతో పేద విద్యార్థుల ఆరోగ్యాన్ని సంరక్షించే దిశగా దీనిని అమలు చేస్తున్నారు. తమిళనాడులో ఇప్పటికే అమలవుతున్నటువంటి పథకాన్ని అధ్యయనం చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. అయితే తమిళనాడులో ఐదవ తరగతి వరకే ఈ పథకాన్ని అమలు చేస్తుండగా, తెలంగాణలో పదవ తరగతి వరకు ప్రతి విద్యార్థికి అమలు చేయాలని నిర్ణయించారు.
సీఎం కేసీఆర్.. మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జడ్పీహెచ్ఎస్‌లో ఈ పథకాన్ని శుక్రవారం ఉదయం 8:45 గంటలకు ప్రారంభించనున్నారు. అయితే.. తెలంగాణ వ్యాప్తంగా 27,147 పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. అయితే.. పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందే అల్పాహారం అందించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అల్పాహారం పథకంలో భాగంగా.. మెనూ కూడా ఖరారైంది. విద్యార్థులకు పోషకాలతో కూడా బలవర్దకమైన అల్పాహారాన్ని ఇచ్చేలా ఈ మెనూను సిద్ధం చేశారు.
CM Breakfast Scheme Menu – సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ మెనూ
సోమవారం | ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ |
మంగళవారం | పూరి, ఆలు కుర్మ లేదా టమాటా బాత్ విత్ రవ్వ, చట్నీ |
బుధవారం | ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చట్నీ |
గురువారం | మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్ |
శుక్రవారం | ఉగ్గాని లేదా పోహా లేదా మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ |
శనివారం | పొంగల్ సాంబార్ లేదా వెజిటబుల్ పులావ్, రైతా లేదా ఆలూ కుర్మ |
రాష్ట్రంలో ప్రైమరీ స్కూళ్లు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు పని చేయనుండగా… బ్రేక్ ఫాస్ట్ ఉదయం 8:45 గంటల నుంచే ఇవ్వనున్నారు. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని స్కూళ్లు ఉదయం 8:45 నుంచి సాయంత్రం 3:45 వరకు పని చేస్తుండగా… బ్రేక్ ఫాస్ట్ ఉదయం 8 గంటల నుంచే పంపిణీ చేస్తారు. ఇక అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ స్కూళ్లు.. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు నడుస్తుండగా.. బ్రేక్ ఫాస్ట్ 8:45 నుంచి ఇవ్వనున్నారు.
Leave a Reply