తెలంగాణ రాష్ట్రంలో గర్భిణీలలో పోషక ఆహార లోపం, రక్తహీనత వంటి సమస్యలు లేకుండా సరైన పోషణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం “కేసీఆర్ న్యూట్రిషన్ కిట్” పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
ఈ పథకాన్ని జూన్ 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.
కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ ను ప్రారంభించిన సీఎం
హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆరుగురు గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందించడం జరిగింది.
కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ అంటే ఏమిటి? అందులో ఏముంటాయి?
కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ (KCR Nutrition Kit) లో మొత్తం ఏడు రకాల వస్తువులు ఉంటాయి.
- కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్
- కిలో ఖర్జూరం
- మూడు ఐరన్ సిరప్ బాటిల్లు
- అరకిలో నెయ్యి
- 200 గ్రాముల పల్లీల పట్టి
- ఒక కప్పు
- ప్లాస్టిక్ బాస్కెట్
పైన పేర్కొన్న ఏడు వస్తువులను ఈ కిట్ లో భాగంగా గర్భిణీలకు అందించడం జరుగుతుంది.
ఈ కిట్లను ఎక్కడ అందిస్తారు
కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లను గర్భిణీలు రెండు లేదా మూడో ANC చెకప్ కి వచ్చే సమయంలో అందించడం జరుగుతుంది. నేరుగా హాస్పిటల్లో వీటిని అందిస్తారు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 జిల్లాలలో ఈ పథకాన్ని జూన్ 14 నుంచి అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.8 లక్షల మంది గర్భిణీలకు ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ పథకానికి 250 కోట్లను బడ్జెట్లో కేటాయించడం జరిగింది.
Leave a Reply