యావత్ దేశం ఉత్కంఠ రేపిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు ఏకపక్ష మెజారిటీ ని కట్టబెట్టాయి. కన్నడ ఓటర్లు ఏకంగా 136 స్థానాలలో కాంగ్రెస్ ను గెలిపించి సునాయాస అధికారాన్ని హస్తగతం చేశారు.
కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అయితే మ్యానిఫెస్టోలో పెట్టిన వాటిని నెరవేర్చడం కూడా మరో పెద్ద ఛాలెంజ్.
కాంగ్రెస్ మానిఫెస్టో లో ప్రజలను ఆకర్షించిన 5 కొత్త పథకాలు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పలు కొత్త పథకాలను అమలు చేస్తామని గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. వీటిలో కింద ఇవ్వబడిన 5 పథకాలు కీలకం.
1. కర్ణాటక గృహ జ్యోతి – ఈ పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నారు.
2. కర్ణాటక గృహలక్ష్మి పథకం – పెళ్లి అయిన మహిళలకు మరియు వీటితో పాటు విడాకులు లేదా విడిగా ఉంటున్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. వీరికి ప్రతినెల ₹2000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.
3. అన్న భాగ్య పథకం – ఈ పథకం ద్వారా రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యునికి 10 కేజీల బియ్యం నెలకి పంపిణీ చేయనున్నారు
4. ఉచిత ప్రయాణ – మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం
5. కర్ణాటక యువ నిధి – ఈ పథకం ద్వారా కనీసం డిగ్రీ చదివిన నిరుద్యోగులకు నెలకు ₹3000 బృతి, డిప్లొమా చదివిన వారికి ₹1500 బృతి ఇస్తారు.
Leave a Reply