రాష్ట్రంలోని పేద ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించడం జరిగింది.
అందులోని కాపు వర్గానికి చెందిన పేద ప్రజలకు ఆర్థిక సహాయం కోసం మరియు స్వయం ఉపాధి కల్పించడం కోసం వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించింది.
రాష్ట్రంలోని ఆటో మ్యాక్సీ ట్యాబ్ వాహనాలు కలిగిన డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించడం కోసం వైఎస్సార్ వాహన మిత్ర పథకం ప్రారంభించింది.
2023 వ సంవత్సరానికి గాను కాపు నేస్తం మరియు వాహన మిత్ర దరఖాస్తు ప్రక్రియ మరియు పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ మొదలైంది.
మొదటగా కాపు నేస్తం పథకానికి కొత్తగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి జూలై 22 చివరి తేదీగా ప్రకటించారు. అయితే తేదీ ముగిసిన చాలామంది అర్హులు వివిధ కారణాల చేత అప్లై చేసుకోలేని కారణంగా ఈ దరఖాస్తు ప్రక్రియను జూలై 25 వరకు పొడిగించారు. మళ్లీ మళ్లీ ఈ ప్రక్రియకు జూలై 27 వరకు అవకాశం కలిగించింది. అయితే టైం లైన్స్ ప్రకారం ఫీల్డ్ వెరిఫికేషన్ 26వ తేదీ వరకు గడువుంది. ఈ గడువు పొడిగింపు పై ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.
వాహన మిత్ర పథకానికి సంబంధించి 2023వ సంవత్సరానికి గాను కొత్త అర్హుల దరఖాస్తు ప్రక్రియకు మొదట జూలై 22 వరకు అవకాశం కలిగించారు. అయితే సాంకేతిక కారణాలవల్ల దరఖాస్తు ప్రక్రియ ఆలస్యంగా మొదలు కావడంతో, ఈ ప్రక్రియకు జూలై 25 వరకు అవకాశం కలిగించారు. ఇంకా చాలామంది అర్హులు అప్లై చేసుకుని కారణంగా ఈ గడువును జూలై 27 వరకు పొడిగించడం జరిగింది.
ఇది అర్హులైన వారికి సువర్ణ అవకాశం. వెంటనే మీ పరిధిలోని సచివాలయాల ద్వారా కాపు నేస్తం మరి వాహనం పథకాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోండి.
ఈ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు ముఖ్యమైన లింకులు అప్డేట్ల కొరకు ఇందు లింకులను క్లిక్ చేయండి
Leave a Reply