వైఎస్ఆర్ కాపు నేస్తం దరఖాస్తుకు నేడే చివరి తేదీ, పాత వారికి వెరిఫికేషన్

వైఎస్ఆర్ కాపు నేస్తం దరఖాస్తుకు నేడే చివరి తేదీ, పాత వారికి వెరిఫికేషన్

కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఆర్థిక సహాయం అందించే వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి సంబంధించి కొత్త దరఖాస్తులకు నేడే చివరి తేదీ.

కొత్త పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ కు జూలై 26 వరకు

కాపు నేస్తం కొత్త అప్లికేషన్స్ కి జూలై 22 చివరి తేదీ కాగా, అప్లికేషన్స్ సచివాలయాల స్థాయిలో పరిశీలన కు జూలై 26 చివరి తేదీ గా ఉంది.

అదే విధంగా పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ కొరకు కూడా జూలై 26 చివరి తేదీ గా ఉంది.

ఈ పథకం ద్వారా కాపు కులం మహిళలకు ఏటా 15 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ సంవత్సరానికి సంబంధించి కాపు నేస్తం దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. సంబంధించిన ఆప్షన్ సచివాలయం ఉద్యోగులకు ఆప్షన్ కలిగించడం జరిగింది.

ఈ పథకానికి సంబంధించి కొత్త లబ్ధిదారులు మరియు పాత లబ్ధిదారులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి మరియు కావలసిన డాక్యుమెంట్లు తదితర పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

వైస్సార్ కాపు నేస్తం 2023-24 షెడ్యూల్

  • వైస్సార్ కాపు నేస్తం కు సంబంధించి ఉత్తర్వులు విడుదల తేదీ జూలై 18,2023.
  • కొత్త దరఖాస్తులు నమోదుకు చివరి తేదీ జూలై 22, 2023.
  • ఫీల్డ్ వెరిఫికేషన్ కు చివరి తేదీ జూలై 26, 2023.
  • ఆరు దశల ధ్రువీకరణ కు చివరి తేదీ జూలై 27-28, 2023.
  • గ్రామ/వార్డు సచివాలయంలో సోషల్ ఆడిట్ తేదీ జూలై 29, 2023
  • సోషల్ ఆడిట్ పై ఏవైనా కంప్లైన్ట్లు తీసుకునేందుకు చివరి తేదీ జులై 30, 2023 – ఆగస్టు 7,2023
  • తుది అర్హుల, అనర్హుల జాబితా తేదీ ఆగస్టు 9,2023
  • లబ్ధిదారుల eKYC కు చివరి తేదీ ఆగస్టు 10-15, 2023
  • జిల్లా కలెక్టర్ ఆమోదానికి చివరి తేదీ ఆగస్టు 10-12, 2023
  • ఆగస్టు నెలలో అర్హులకు కాపు నేస్తం పథకానికి నగదు జమ.

అర్హతలు

  • కాపు నేస్తం పథకానికి లబ్ధిదారుడు 01.08.1963 నుండి 31.07.1978 మధ్య జన్మించి ఉండాలి.
  • లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి.
  • మహిళలు తప్పనిసరిగా కాపు వర్గానికి చెందినవారై ఉండాలి. కేవలం కాపు ,బలిజ, ఒంటరి మరియు తెలగ కులాలకు చెందిన వారు మాత్రమే అర్హులు. సెట్టి బలిజ, పుస బలిజ, గజు బలిజ కులస్తులు అనర్హులు.
  • దరఖాస్తుదారుల వయస్సు 45 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • దరఖాస్తుదారునికి BPL రేషన్ కార్డు కలిగి ఉండాలి.

కావలసిన డాక్యుమెంట్లు

  1. ఆధార్ కార్డు జిరాక్స్
  2. రైస్ కార్డు జిరాక్స్
  3. Caste సర్టిఫికెట్ (AP Seva)
  4. Income సర్టిఫికెట్ (AP Seva)
  5. ఆధార్ కి లింక్ అయిన ఫోన్ నెంబర్.
  6. బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్
  7. ఆధార్ అప్డేట్ హిస్టరీ

పాత లబ్దిదారులు ఎలా అప్లై చేయాలి?

గత సంవత్సరం వరకు లబ్ధి పొందిన వారి వివరాల లిస్ట్ వెరిఫికేషన్ కొరకు సచివాలయం లోని WEA/ WWDS అధికారుల NBM లాగిన్ లో ఎనేబుల్ చెయ్యడం జరిగింది. ఎనేబుల్ అయిన తరువాత గ్రామ లేదా వార్డు వాలంటీర్లు సమాచారం అందించడం జరుగుతుంది. దరఖాస్తుదారుల వద్ద వెరిఫికేషన్ కొరకు అవసరం అయిన డాక్యుమెంట్లు తీసుకొని, BOP Mobile అప్లికేషన్ లో లబ్ధిదారుల వద్ద బయోమెట్రిక్ eKYC తీసుకోవడం జరుగుతుంది. eKYC పూర్తి చెయ్యడానికి ఈ సంవత్సరం 2023 లో నగదు జమ అవుతుంది.

కొత్తగా అర్హులైన వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

కొత్తగా ఈ సంవత్సరం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు న్యూ అప్లికేషన్ సంబంధించిన డాక్యుమెంట్ లను సచివాలయం లో PSDA/ WEDPS వారికి అందించాలి. అందించిన తరువాత, అర్హత ప్రమాణాలను పరిశీలించి ఆన్లైన్ దరఖాస్తు చెయ్యడం జరుగుతుంది. దరఖాస్తు చేసే సమయంలో దరఖాస్తుదారులు బయోమెట్రిక్ లేదా ఐరిష్ లేదా మొబైల్ ఓటీపీ ద్వారా eKYC పూర్తి చెయ్యవచ్చు.

దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు?

కాపు నేస్తం 2023 సంవత్సరానికి గాను దరఖాస్తు చేసుకోవడానికి తాత్కాలిక చివరి తేదీ జూలై 22.

Click here to Share

You cannot copy content of this page