రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు కీలక సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో కొత్తగా అక్రిడిటేషన్ పొందిన వారు హెల్త్ స్కీం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.అదే విధంగా రెన్యువల్ వారికి కూడా సూచనలు జారీ చేసింది.
వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కోసం 2500 రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం లో ₹1250 రూపాయలు అంటే సగం అమౌంటు జర్నలిస్టు చెల్లిస్తే, మిగతా సగం అమౌంట్ ప్రభుత్వం చెల్లించనుంది.
జర్నలిస్ట్ వాటాగా చెల్లించేటటువంటి ప్రీమియం అమౌంటును www.ap.gov.in వెబ్సైట్ లో ఇవ్వబడినటువంటి సంబంధిత ఖాతా పేరిట చెల్లించాలని ప్రభుత్వం తెలిపింది.
కొత్తగా హెల్త్ స్కీం లో జాయిన్ అవ్వాలి అనుకునేవారు ఒరిజినల్ చలానా తో పాటు నిర్దేశించిన దరఖాస్తు లో వివరాలను పూర్తి చేసి జర్నలిస్ట్, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆధార్, ఫోటో, రేషన్ కార్డ్, కొత్తగా మంజూరైన అక్రిడిటేషన్ కార్డుతో పాటు https://wjhs.ap.gov.in వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని తర్వాత దరఖాస్తు తో పాటు సంబంధిత ధృవ పత్రాల జిరాక్స్ కాపీలను కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో అందజేయాలని పౌర సంబంధాల అధికారులు వెల్లడించారు.
గతంలో హెల్త్ కార్డులు ఉండి రెన్యువల్ చేసుకోవాలి అనుకునే జర్నలిస్టలు సైతం ఒరిజినల్ చలానా తో పాటు గతంలో జారీ చేసిన హెల్త్ కార్డు, ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డ్, ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ లను జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని అధికారులు తెలిపారు.
వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అంటే ఏమిటి?
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జర్నలిస్టులుగా పని చేస్తున్నటువంటి వారికి భీమా సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న వారికి హెల్త్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకంలో భాగమైన జర్నలిస్టు వారి భార్య లేదా భర్త, పిల్లలు మరియు వారిపై ఆధారపడి ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఆరోగ్య భీమా సౌకర్యాన్ని ప్రభుత్వం ఈ పథకం ద్వారా కల్పిస్తుంది.
Leave a Reply