Jaganannaku Chebudam : నేడే జగనన్నకు చెబుదాం కొత్త పథకం ప్రారంభం.. ఇకపై ఒక ఫోన్ కాల్ దూరంలో పరిష్కారం

Jaganannaku Chebudam : నేడే జగనన్నకు చెబుదాం కొత్త పథకం ప్రారంభం.. ఇకపై ఒక ఫోన్ కాల్ దూరంలో పరిష్కారం

రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నకు చెబుతాం అనే కొత్త పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇకపై ప్రస్తుతం ఉన్నటువంటి స్పందన హెల్ప్ లైన్ నెంబర్ 1902 మరింత పటిష్టం కానుంది. ఈరోజు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

అసలు ఏంటి ఈ జగనన్నకు చెబుదాం? ఏం చెప్పవచ్చు?

ప్రజలు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి లేదా ప్రభుత్వ కార్యాలయాలలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి వెంటనే 1902 నంబర్ కు డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటికే ఈ నెంబర్ అందుబాటులో ఉన్నప్పటికీ ఇకపైన ఈ నెంబర్ పై వస్తున్నటువంటి ఫిర్యాదులను మరింత పటిష్టంగా పరిష్కరిస్తారు.

ఈ నెంబర్ పై చెప్తే జగనన్న వింటారా?

ఇకపై ఈ నెంబర్ పై వచ్చే అన్ని ఫిర్యాదులు ముఖ్యమంత్రి కార్యాలయం CMO పర్యవేక్షణలో ఉంటాయి. అదేవిధంగా అన్ని స్థాయిలలో మానిటరింగ్ యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకే ఈ పథకానికి జగనన్నకు చెబుదాం అనే పేరును పెట్టడం జరిగింది.

ఏ విధంగా ఈ కొత్త పథకం అమలు చేస్తారు?

►ఈ పథకం కోసం సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్‌ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయి
►ఈ యూనిట్లను కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్‌ చేయాలి.
►గ్రీవెన్స్‌ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం.
►ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తారు.
►ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లను సీఎంఓ కూడా పర్యవేక్షిస్తుంది
►హెల్ప్‌లైన్‌ 1902 ద్వారా గ్రీవెన్స్‌ వస్తాయి
►వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలి
►గ్రీవెన్స్‌ ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం

►ఇండివిడ్యువల్‌, కుటుంబం స్థాయిలో గ్రీవెన్సెస్‌ ఇవ్వవచ్చు
►రిజ్టసర్‌ అయిన గ్రీవెన్సెస్‌ ఫాలో చేయడం
►ప్రభుత్వ సేవలు, పథకాలపై ఎంక్వైరీ
►ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయడం అన్నది జగనన్నకు చెబుదాం ప్రధాన కార్యక్రమాలు

►ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్‌ అయి ఉంటారు
►వారి గ్రీవెన్స్‌స్‌ను సలహాలను నేరుగా తెలియజేయవచ్చు:
►ముఖ్యమంత్రి మరియు ముఖ్యమంత్రి కార్యాలయం ఈ గ్రీవెన్స్‌స్‌ను నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా చూస్తుంది

►ఐవీఆర్ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు రెగ్యులర్‌ అప్‌డేట్స్ అందుతాయి
►అంతేకాక ఇదే హెల్ప్‌లైన్‌ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులనుంచి అధికారులు ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకుంటారు
►గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్‌ గురించి అవగాహన కల్పిస్తారు
►ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకునేలా వారిని మరింతగా ప్రోత్సహిస్తారు..

►ఎవరైనా పిర్యాదు సరిగ్గా పరిష్కారం కాలేదు అని భావిస్తే ఫీడ్బ్యాక్ ఆధారంగా ఫిర్యాదును తిరిగి తెరుస్తారు

Jaganannaku Chebudam helpline number : 1902

జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమల్లో మూడు కీలక యంత్రాంగాల ఉంటాయి


►సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకూ ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయి

►ప్రతి జిల్లాకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులుప్రత్యేకాధికారులుగా ఉంటారు
►క్రమం తప్పకుండా ఆయా జిల్లాలను వీరు సందర్శించి పర్యవేక్షిస్తారు
►ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను పర్యవేక్షిస్తారు
►కలెక్టర్లతో కలిపి… జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారు
►సమస్యల పరిష్కారాల తీరును రాండమ్‌గా చెక్‌చేస్తారు
►ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల పనితీరును పర్యవేక్షిస్తారు
►ఎక్కడైనా స పట్ల సంతృప్తి లేకపోతే.. దాన్ని తిరిగి ఓపెన్‌ చేస్తారు

►ఎస్‌ఎంఎస్‌, ఐవీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా దాన్ని తిరిగి తెరుస్తారు

►పరిష్కార తీరుపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తారు

►చీఫ్‌సెక్రటరీ, సీఎంఓ, డీజీపీతో కలిసి రెగ్యులర్‌గా మానిటర్‌ చేస్తారు

►ప్రతి 15 రోజులకోసారి పూర్తిస్థాయిలో సమీక్ష ఉంటుంది

►ప్రజలకు నాణ్యమైన సేవలను అదించాలన్నదే ఈ పథకం ఉద్దేశం అని ప్రభుత్వం తెలిపింది.

►ప్రతి కలెక్టర్‌కు రూ.3 కోట్ల రూపాయలను తక్షణ నిధులుగా ప్రభుత్వం ఇస్తుంది

►అవసరమైన చోట.. ఈ డబ్బును ఖర్చు చేయవచ్చు

►వీటిని ఖర్చు చేసే అధికారం కలెక్టర్‌కు ఇస్తారు.

►దీనివెల్ల వేగవంతంగా గ్రీవెన్స్‌స్‌ పరిష్కారంలో డెలవరీ మెకానిజం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది

►అంతేకాకుండా గ్రామ స్థాయిలోని సచివాలయాలు, ఆర్బీకేలు, అంగన్‌వాడీలు, విలేజ్‌క్లినిక్స్‌.. అవన్నీకూడా సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్న అంశంపైన కూడా వీరు దృష్టిపెడతారు.

►ఇవి సక్రమంగా పనిచేస్తే… చాలావరకు సమస్యలు సమసిపోయే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page