పరుసుగా నాలుగో ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని ప్రారంభించింది.జగనన్న విద్యా కానుక నాలుగో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంచనంగా ప్రారంభించారు.
జగనన్న విద్యా కానుక ప్రారంభించిన సీఎం [ Vidya Kanuka Lunched for Fourth Consecutive Year]
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ఏయిడెడ్ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్నటువంటి 43,10,165 మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్స్ పంపిణీ ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. పల్నాడు జిల్లా క్రోసూరు నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
1042.53 కోట్లను ప్రభుత్వం ఈ కిట్స్ కోసం ఖర్చు చేస్తుంది.
విద్యా కానుక కిట్ లో ఏం పంపిణీ చేస్తారు
విద్యా కానుక ఇట్లు భాగంగా మొత్తం ఆరు రకాల వస్తువులను విద్యార్థులకు పంపిణీ చేస్తారు.
1. మూడు జతల యూనిఫాం
2. నోట్ బుక్స్ మరియు పాఠ్య పుస్తకాలు
3. బూట్లు లేదా షూస్
4. రెండు జతల సాక్సులు
5. బెల్ట్
6. స్కూల్ బ్యాగ్
అంతేకాకుండా ఒకటి నుంచి 5 వ తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీ మరియు 6 నుంచి 10వ తరగతి పిల్లలకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది.
ఇక ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను బైలింగ్వల్ గా ప్రింట్ చేస్తుంది. అంటే ఒక పేజీలో ఇంగ్లీష్ లో కంటెంట్ ఉంటే మరొక పేజీలో తెలుగులో కంటెంట్ ఉంటుంది. ఒక్కో కిట్ కి రాష్ట్ర ప్రభుత్వం సుమారు ₹2500 రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించింది.
జూన్ 12 నుంచి పాఠశాలలో ప్రారంభమైన నేపథ్యంలో ఇదే రోజున రాష్ట్రప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. జూన్ 12 నుంచి 17 వరకు ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా విద్యార్థులకు రాగిజావను ఉ.8.30 నుంచి 9 గంటల మధ్యలో అందించడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని 11:30 నుంచి 12 మధ్యలో అమలు చేస్తున్నారు.
Leave a Reply