Jagananna Videshi Vidya deevena Scheme -జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం

Jagananna Videshi Vidya deevena Scheme -జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం

ఈ పథకం ముఖ్య ఉద్దేశం

రాష్ట్ర విద్యార్థులను అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది చదువుల్లో నాణ్యత పెంపొందించి ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించింది. పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ కోర్సులకు సంబంధించి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో మేలు చేకూర్చేలా ఉత్తర్వులు జారీ చేసింది.

ఎవరికి వర్తిస్తుంది!

గతంలో ఉండే పథకానికి పలు సవరణలు చేసి పునః ప్రారంభించడం జరిగింది.వార్షిక ఆదాయ పరిమితిని పెంచి ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ పేదలకు కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చేలా చర్యలు చేపట్టింది. క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలో టాప్‌ 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన ఏపీ విద్యార్థుల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం  టాప్‌–100 యూనివర్సిటీల్లో సీటు సాధించే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వర్తింపచేస్తుంది.

టాప్‌ 100 – 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికి రూ.50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. తద్వారా రాష్ట్ర విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడంతోపాటు నాణ్యతతో కూడిన ఉన్నత చదువులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు సైతం ఈ స్థాయిలో ప్రయోజనం చేకూర్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం దేశంలోనే మరొకటి లేదని విద్యారంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

అర్హతలు:

వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలు. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింప చేయనున్నారు.

టాప్‌ 200 యూనివర్సిటీల్లో ఎన్ని సీట్లు సాధిస్తే అంతమందికీ సంతృప్త స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించనున్నారు.

35 ఏళ్లలోపు ఉన్న వారిని అర్హులుగా గుర్తిస్తారు.

ఏపీలో స్థానికులై ఉండాలి.

కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింప చేయనున్నారు. ఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపు కోసం నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది. 

ప్రస్తుతం ఈ పథకాన్ని ఎలా సవరించారు.

► ప్రతిభను పరిగణలోకి తీసుకుంటూ అగ్రవర్ణ పేద విద్యార్థులకూ పథకం వర్తింపు.

► ఆదాయ పరిమితిని రూ.8 లక్షలకు పెంచి మరింత మందికి మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు.

► ప్రపంచంలో ఎక్కడైనా సరే టాప్‌ 200 యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు సంతృప్త స్థాయిలో పథకం వర్తింపు. 

► టాప్‌ 100 యూనివర్సిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపు. 101 – 200 లోపు ర్యాంకింగ్స్‌ యూనివర్సిటీల్లో సీటు సాధిస్తే రూ.50 లక్షల వరకూ ఫీజులు చెల్లించనున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

► ఆంక్షలు లేకుండా టాప్‌ 200 యూనివర్సిటీల్లో ఎంతమంది సీట్లు సాధిస్తే అంతమందికీ వర్తింప చేయాలని ప్రభుత్వ నిర్ణయం.

ఎలా చెల్లిస్తారు?

నాలుగు వాయిదాల్లో ఖాతాల్లో జమనాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమ చేస్తారు. ల్యాండింగ్‌ పర్మిట్‌ లేదా ఐ–94 ఇమ్మిగ్రేషన్‌ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లించనున్నారు. ఫస్ట్‌ సెమిస్టర్‌ లేదా టర్మ్‌ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లిస్తారు. రెండో సెమిస్టర్‌ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లిస్తారు. నాలుగో సెమిస్టర్‌ లేదా ఫైనల్‌ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లించనున్నారు. పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఏడాది వారీగా లేదా సెమిస్టర్‌ వారీగా కోర్సు పూర్తయ్యే వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌  చెల్లించనున్నారు. 

Click here to Share

One response to “Jagananna Videshi Vidya deevena Scheme -జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం”

  1. Srinivas reddy Avatar
    Srinivas reddy

    సార్ విదేశంలో టాప్ కాలేజ్ లో జాయిన్ కావాలంటె మనకు కాలేజీ టాప్ రాంక్ లో ఉంది అని ఎలా తెలుస్తుంది మాకు టెస్ట్ పెడతారా లేఖ మేము పేమెంట్ లో జాయిన్ అయితే మీరు ఫ్రీ రియాంబర్స్మెంట్ ఇస్తారా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page