జగనన్న విదేశీ విద్య దీవెన అమౌంట్ ను విడుదల చేయనున్న ప్రభుత్వం

జగనన్న విదేశీ విద్య దీవెన అమౌంట్ ను విడుదల చేయనున్న ప్రభుత్వం

విదేశాల్లో ఉన్నత విద్య.. ప్రతి విద్యార్థి స్వప్నం! కాని అమెరికా, బ్రిటన్‌ లాంటి దేశాల్లోని అత్యున్నత శ్రేణి యూనివర్సిటీల్లో అడుగుపెట్టాలంటే.. రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు ఫీజులు, ఇతరత్రా వ్యయాలకు వెచ్చించాలి! దాంతో ఎందరో ప్రతిభావంతులు తమకు వచ్చిన అవకాశాలను సైతం వదులుకుంటున్న పరిస్థితి! ఇలాంటి విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకం ప్రవేశ పెట్టింది.

టాప్‌-100 వర్సిటీల్లో చేరితే పూర్తి ట్యూషన్‌ ఫీజు చెల్లింపు. 101-320 వర్సిటీల్లో చేరితే రూ.50 లక్షల వరకు చేయూత. క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ ప్రామాణికంగా వర్సిటీల గుర్తింపు

ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు ఉచిత విదేశీ విద్య అందుతుంది. ఈ సంవత్సరానికి గాను జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను విడుదల తేదీ మరియు అమలను రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ నెల 28న విదేశీ విద్యా దీవెన కింద అర్హులైన లబ్ధిదారులకు రూ.50 కోట్ల మేర జమ చేయనున్నారు.

You cannot copy content of this page