Jagananna Suraksha : జగనన్న సురక్ష ప్రారంభించిన సీఎం.. ఇక ప్రభుత్వ పథకాల సమస్యలు, సర్టిఫికెట్లకు వెంటనే పరిష్కారం

Jagananna Suraksha : జగనన్న సురక్ష ప్రారంభించిన సీఎం.. ఇక ప్రభుత్వ పథకాల సమస్యలు, సర్టిఫికెట్లకు వెంటనే పరిష్కారం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎవరికైనా సంక్షేమ పథకాలు,రేషన్ కార్డ్ మరియు ఏవైనా సర్టిఫికెట్ల సమస్యలు ఉంటే వాటిని త్వరితగతిన పరిష్కరించి లబ్ధిదారులకు ఆయా సర్టిఫికెట్లు లేదా సంక్షేమ పథకాలు వర్తింపచేయాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం “జగనన్న సురక్ష” అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.

జగనన్న సురక్ష పథకాన్ని లాంచనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి

నెలరోజుల పాటు 15004 సచివాలయాల పరిధిలో విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని నేడు తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం ప్రారంభించారు.

అసలు ఏంటి ఈ జగనన్న సురక్ష? కార్యచరణ ఏంటి?

ప్రజలకు ఏదైనా పత్రాలకు సంబంధించి, సర్టిఫికెట్లకు సంబంధించి లేదా సంక్షేమ పథకాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ జగనన్న సురక్ష కార్యక్రమం వేదిక కానుంది.

ప్రజల ఫిర్యాదుల కోసం ఇప్పటికే ఉన్నటువంటి జగనన్నకి చెబుదాం కార్యక్రమానికి అనుసంధానంగా ఈ పథకం కూడా కొనసాగనుంది.

ముందుగా వాలంటీర్లు సిబ్బంది మరియు ఇతర ప్రజాప్రతినిధులతో ఇంటింటి సందర్శన

ఈ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహ సారధులు ఇంకా ఎవరైనా ఔత్సాహికలు ఉంటే ఒక బృందంగా ఏర్పడి జూన్ 24 నుంచి క్లస్టర్ల వారీగా ప్రతి ఇంటిని సందర్శించడం జరుగుతుంది.

ప్రతి ఇంటికి వెళ్లి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకుంటారు. వారికి అర్హత ఉండి ఏవైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించి సమస్యలు ఉన్నా, సర్టిఫికెట్లు జారి కాకపోయినా, రేషన్ కార్డుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని నమోదు చేసుకొని సచివాలయానికి వెళ్లి వారికి ఒక టోకెన్ జనరేట్ చేసి ఆ టోకెన్ నెంబర్ ను వాలంటీర్లు తిరిగి అదే ఇంటిలో ఉన్న వారికి అందిస్తారు.

ఈ విధంగా జూన్ 24 నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు.

జూలై 1 నుంచి నెల రోజులపాటు క్యాంపులు

ఇంటింటి ప్రచారంలో భాగంగా ఏవైతే సమస్యలను తెలుసుకోవడం జరిగిందో ఆ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా మరియు గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఇతర సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు జూలై 1 నుంచి నెలరోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం క్యాంపులను నిర్వహిస్తోంది.

ఈ క్యాంపుల నిర్వహణకు మండల స్థాయి అధికారులు అయిన తాహసిల్దార్,ఈవో పిఆర్డి ఒక టీమ్ గా ఏర్పడతారు, ఇంకా ఎంపీడీవో, డిప్యూటీ తాహాసిల్దార్ మరొక టీమ్ గా ఏర్పడి ఒకరోజు పూర్తిగా ప్రతి సచివాలయంలో క్యాంపు ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజల సమస్యలను  నమోదు చేసుకున్నటువంటి సమస్యలను పరిష్కరించడం మరియు సర్టిఫికెట్లను ఎటువంటి రుసుము లేకుండా వెంటనే జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటారు.

ఏ సర్టిఫికెట్ల పైన మరియు అంశాల పైన ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది?

ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ మరియు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనగా కుల ధ్రువీకరణ పత్రం మరియు నివాస పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, మ్యుటేషన్స్, మ్యారేజ్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఆధార్ లో మొబైల్ నవీకరించుట, కౌలు రైతులకు సిసిఆర్సి, కొత్త రేషన్ కార్డు లేదా ఉన్న రేషన్ కార్డు ని విభజించడం, హౌస్ హోల్డ్ అంటే కుటుంబ సభ్యులను విభజించడం వంటి ప్రముఖ అంశాలపై జగనన్న సురక్ష కార్యక్రమం దృష్టి సారిస్తుంది. ఈ అంశాలకు సంబంధించి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే త్వరితగతిన ఈ పథకం ద్వారా పరిష్కరిస్తారు.

List of focused services

రాష్ట్ర వ్యాప్తంగా 15004 క్యాంపులు

జూలై 1 నుంచి పైన పేర్కొన్న విధంగా రెండు టీంలుగా ఏర్పడినటువంటి మండల స్థాయి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15004 నాలుగు సచివాలయాలలో అదే సంఖ్యలో కుసంపులను నిర్వహించి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి, అర్హులైన వారికి ఎటువంటి ఫీజు లేకుండా అప్పటికప్పుడు సర్టిఫికెట్లను కూడా జారీ చేస్తారు.

ఇక గృహ సందర్శన సమయంలో వాలంటీర్లతో కూడినటువంటి బృందం సమస్యలు ఉన్నటువంటి కుటుంబానికి ఒక టోకెన్ ఇస్తుంది. ఆ టోకన్ తో పాటు ఎప్పుడు తమ సచివాలయ పరిధిలో క్యాంపులు నిర్వహిస్తారో తెలియజేసి ఆ తేదీన రావలసిందిగా కోరడం జరుగుతుంది. వారు వచ్చిన తేదీన జరిగే క్యాంపులో ప్రజల యొక్క సమస్యలను త్వరగా పరిష్కరించి కావాల్సిన సర్టిఫికెట్లను వెంటనే జారీ చేస్తారు.

You cannot copy content of this page