జగనన్న గోరుముద్ద : రాగి జావ కోసం ఎవరి గ్లాస్ వారే తెచ్చుకోండి..విద్యా శాఖ సూచన

జగనన్న గోరుముద్ద : రాగి జావ కోసం ఎవరి గ్లాస్ వారే తెచ్చుకోండి..విద్యా శాఖ సూచన

ప్రభుత్వం జగనన్న గోరుముద్ద – మధ్యాహ్న భోజన పథకం లో భాగంగా వారానికి మూడు రోజులు పిల్లలకు రాగి జావ ఇవ్వాలని నిర్ణయంచిన విషయం తెలిసిందే. ఈ మేరకు మార్చ్ 21 నుంచి పూర్తి స్థాయి లో దీనిని అమలు పరచనున్నారు.

చిక్కి ఇవ్వని రోజుల్లో ఈ రాగి జావను పిల్లలకు ప్రభుత్వం అందిస్తుంది. పిల్లల్లో ఐరన్, క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలను అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ విద్యా సంవత్సరానికి గ్లాసులు ఇంటి నుంచి తెచ్చుకోవాలని సూచన

రాగి జావ కోసం పిల్లలు ఇంటి నుంచే గ్లాసులు తెచ్చుకోవాలని విద్యా శాఖ సూచించింది. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి తామే గ్లాసులు ఇస్తామని పేర్కొంది.

గ్లాసుల కొనుగోలు కు టెండర్లు పిలిచినప్పటికి ఇంకా సరఫరా కు నెల రోజులు పట్టే అవకాశం ఉంది. అందువలన ఈ మేరకు సూచించినట్లు సమాచారం.

అయితే ఎవరైనా గ్లాసులు తెచ్చుకొలేక పోతే వారికి ఏదో విధంగా రాగి జావ ను ఇవ్వాలని, అలా అని వారికి ఇవ్వకుండా ఉండ వద్దని సూచనలు చేసింది.

ఈ రాగి జావ తయారీ లో ఉపయోగించే రాగి పిండి మరియు బెల్లాన్ని, శ్రీ సత్య సాయి ట్రస్ట్ ఉచితంగా అందిస్తుంది. సుమారు 38 లక్షల మందికి ఈ రాగి జావను పంపిణీ చేయనున్నారు.

ఇది చదవండి : రాగి జావ తాగడం వలన ఏ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా?

Click here to Share

You cannot copy content of this page