రాష్ట్ర వ్యాప్తంగా రజకులు నాయి బ్రాహ్మణులు మరియు టైలర్ లకు ప్రతి ఏటా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేటటువంటి జగనన్న చేదోడు అమౌంటును వరుసుగా నాలుగో ఏడాది ముఖ్యమంత్రి గత నెల 19 న లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది.
అయితే పలు కారణాల రీత్యా మరియు వరుస బ్యాంక్ సెలవుల కారణం చేత ఈసారి అమౌంట్ విడుదల కొంత ఆలస్యం అయింది.
తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం అందరి ఖాతాలో ప్రభుత్వం అమౌంట్ చేసినట్లు తెలుస్తుంది. అదే విధంగా పేమెంట్ స్టేటస్ వివరాలను కూడా ప్రభుత్వం తమ అధికారిక పోర్టల్ లో అప్డేట్ చేయడం జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజకులు నాయి బ్రాహ్మణులు మరియు టైలర్ లకు 325.02 కోట్ల ఆర్థిక సహాయాన్ని సీఎం లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది.
షాపులు కలిగి ఉన్నటువంటి రజకులు నాయి బ్రాహ్మణులు ట్రైలర్లకు ప్రతి ఏటా పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం జగన్ అన్న చేదోడు పథకం ద్వారా అందిస్తున్న విషయం మనకు తెలిసిందే.
CM Releases Jagananna Chedodu 2023-24 amount credited for the fourth consecutive year.
జగనన్న చేదోడు పేమెంట్ స్టేటస్ వివరాలు ఇలా చెక్ చేయండి
జగనన్న చేదోడు పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ వివరాలను మీరు కింది లింక్ లో ఇవ్వబడినటువంటి అధికారిక పోర్టల్ కి వెళ్లి మీ ఆధార్ తో చెక్ చేయవచ్చు.
Jagananna Chedodu Payment Status 2023-24
Scheme దగ్గర మీరు జగనన్న చేదోడు ఎంచుకొని , year దగ్గర 2023-24 అని ఎంచుకోవాలి. ఆ తర్వాత UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, Captcha కోడ్ ను యధావిధిగా టైప్ చేసి Get OTP పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి వచ్చినటువంటి ఓటిపి వివరాలను ఎంటర్ చేసి మీ పథకానికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ వివరాలను సులభంగా పొందవచ్చు. ఇందుకు సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ పూర్తి ప్రాసెస్ పైన లింక్ లో ఇవ్వబడింది చెక్ చేయండి.
Leave a Reply