రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష [Jagananna Aarogya Suraksha] అనే కొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల ఆరోగ్య పరిస్థితులపై డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ క్యాంపులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ హెల్త్ క్యాంపుల్లో అవసరమైన వారికి ఉచితంగా చికిత్స చేయడం జరుగుతుంది.
జగనన్న ఆరోగ్య సురక్ష అంటే ఏమిటి?
జగనన్న ఆరోగ్య సురక్ష అనేది పైన పేర్కొన్న విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులకు ఆరోగ్య సేవలు అందించేందుకు తీసుకువచ్చిన కొత్త కార్యక్రమం.
ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించడం జరుగుతుంది.
1. ముందుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ANM మరియు వాలంటీర్లు తమ పరిధిలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటారు. అవసరమైన వారికి కావలసిన టెస్టులు కూడా చేస్తారు. ఎవరికైతే డాక్టర్ తో తదుపరి కన్సల్టేషన్ అవసరం ఉంటుందో వారిని క్యాంపు నిర్వహించే రోజున డాక్టర్ వద్దకు తీసుకు వెళ్ళటం జరుగుతుంది.
2. ఈ కార్యక్రమంలో ఇంటింటి సర్వే అయిపోయిన తర్వాత గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆరోగ్య క్యాంపులను నిర్వహిస్తుంది. పైన ముందుగా గుర్తించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వారిని ఈ క్యాంపులో డాక్టర్లు ఉచితంగా పరిశీలించి చికిత్స అందిస్తారు.
ఎవరికైతే తదుపరి చికిత్స అవసరం ఉంటుందో వారిని ఇంకా పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేయడం జరుగుతుంది.
ఈ క్యాంపులకు ప్రత్యేకంగా డాక్టర్లను మరియు స్పెషలిస్ట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది.
గ్రామీణ ప్రాంతంలో ఒక్కో క్యాంపుకు 40 వేల రూపాయలు పట్టణ ప్రాంతంలో ఒక్కో క్యాంపుకు లక్ష రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ క్యాంపులను ఎప్పటి నుంచి నిర్వహిస్తారు? ఎక్కడ నిర్వహిస్తారు?
ఈ క్యాంపులను పాఠశాల ప్రాంగణంలో కానీ లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిసరాలలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ మరియు సన్నద్దత అంతా కూడా సెప్టెంబర్ ఐదు నుంచి ప్రారంభమవుతుంది.
ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. రిపోర్టింగ్ కోసం ప్రస్తుతం జగనన్న సురక్ష యాప్ ను ఇందుకోసం ఉపయోగించనున్నారు. అదేవిధంగా వాలంటీర్లను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తారు.
తొలి ఆరోగ్య సురక్ష క్యాంపును సెప్టెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది.
వాలంటీర్లు మరియు ANM లు చేయవలసిన పనులు
- వాలంటీర్స్ మరియు ANM లు ప్రతి ఇంటికి వెళ్లి GSWS వాలంటీర్ App లో ఇచ్చిన Questions తో సర్వే చేయాలి. మరియు సర్వే సమయంలో photo తీసి అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుంది.
- ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని App లో నమోదు చేయాలి. వారిని క్యాంపు రోజు క్యాంపు సచివాలయం వద్దకు తీసుకురావాలి.
- జగనన్న ఆరోగ్య సురక్ష బ్రోచర్లు పంపిణీ చేయాలి..
- ఆరోగ్య శ్రీ పథకానికి సంబందించి వినియోగం మరియు ప్రయోజనాల పైన ప్రజలకు అవగాహన కల్పించాలి.
జగనన్న ఆరోగ్య సురక్ష Timelines
- సెప్టెంబర్ 7న campaign Schedule MPDO’S ద్వారా నిర్ణయించడం జరుగుతుంది.
- State level meeting సెప్టెంబర్ 8న నిర్వహిస్తారు
- ANM’s కి Departmental ట్రైనింగ్ మరియు వాలంటీర్స్ కి FOA ‘s ద్వారా ట్రైనింగ్ సెప్టెంబర్ 12 వ తేది లోపు పూర్తి చేయడం జరుగుతుంది.
- జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్ సెప్టెంబర్ 15న కార్యక్రమం ప్రారంభం
- ఆరోగ్య శ్రీ పంప్లెట్స్ (Brochures ) : సెప్టెంబర్ 20
- జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు : సెప్టెంబర్ 30
Leave a Reply