ఈ ఏడాదికి సంబంధించి జగనన్న అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 28న విడుదల చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
జగనన్న అమ్మఒడి షెడ్యూల్ ( టైం లైన్స్ ) ఇవే
జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి జూన్ 22 లోపు సచివాలయాల ద్వారా లబ్ధిదారుల ఈకేవైసీ తీసుకోవడం జరుగుతుంది.
జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి ముఖ్యమైన టైం లైన్స్ కింది లింక్ ద్వారా చెక్ చేయండి.
జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి అర్హతలు ఇవే
జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి అర్హతలను మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులతో పాటు పేర్కొనడం జరిగింది.
పూర్తి అర్హతలు ఇవే
- కుటుంబా ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతినెల పదివేల రూపాయలు మించరాదు అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రతినెల 12 వేల రూపాయలు మించరాదు
- మొత్తం కుటుంబానికి సంబంధించినటువంటి భూమి మెట్ట భూమి అయితే పది ఎకరాల లోపు, మాగాణి అయితే మూడు ఎకరాలలోపు ఉండాలి. రెండు కలిపి కూడా 10 ఎకరాలకు మించి ఉండకూడదు.
- విద్యుత్ వినియోగం 300 యూనిట్లు ప్రతినెల గత 12 నెలల కాలంలో మించి ఉండకూడదు.
- కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి గాని లేదా ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వ్యక్తులు ఉండకూడదు. అయితే పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇవ్వడం జరిగింది.
- కుటుంబంలో ఎవరికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. అయితే టాక్సీ, ట్రాక్టర్, ఆటోలకు మినహాయింపు ఇచ్చారు.
- కుటుంబంలో ఎవరు కూడా ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉండకూడదు
- చివరగా మున్సిపాలిటీ ప్రాంతాల్లో వేయి చదరపు అడుగుల మించి ఎటువంటి ఆస్తి లేదా ప్రాపర్టీ ఉండరాదు.

పైన పేర్కొన్న అంశాలకు సంబంధించి మీ అర్హతలను చెక్ చేసుకునేందుకు కింది లింక్ పై క్లిక్ చేయండి
అమ్మ ఒడి అప్లికేషన్ స్టేటస్
జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి లబ్ధిదారులు తమ అప్లికేషన్ స్టేటస్ లేదా పేమెంట్ విడుదల తర్వాత పేమెంట్ స్టేటస్ ను కింది ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
జూన్ 28వ తేదీన విద్యార్థుల తల్లుల ఖాతాలో 15 వేలల్లో నుంచి 2000 రూపాయలను మినహాయించుకుని 13 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. మిగిలిన రెండు వేల రూపాయలను టీఎంఎఫ్ కింద మెయింటెనెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం జమ చేసుకుంటున్న విషయం తెలిసిందే.
5 responses to “Amma Vodi 2023 : జూన్ 28న జగనన్న అమ్మఒడి.. అర్హతలు, ముఖ్యమైన తేదీలు విడుదల.. స్టేటస్ ఇలా చెక్ చేయండి”
Hii
Electric consumption not 3 units, add 300 units i request you kindly check the data after you post the website
Corrected. Thanks for highlighting typo
electric consumption not 3 , add 300 i request you kindly check the after you post the website
Thankyou
Super