రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి నగదు జమ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, జూన్ 17 లోపు లబ్ధిదారులందరి ఖాతాలో నగదు జమ అయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికీ కొంతమందికి అమౌంట్ పడలేదని తెలుస్తోంది. అయితే మీరు కింద ఇవ్వబడిన లింకులో మీ ఆధార్ ద్వారా మీరు మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అందులో మీకు ఎలిజిబుల్ అని ఉంటే మీకు అమౌంట్ పడుతుంది. కాబట్టి వెయిట్ చేయగలరు. మీకు అర్హత ఉండి కూడా ineligible అని ఉంటే ఏం చేయాలో మనం కింద తెలుసుకుందాం.
Click here for Thalliki Vandanam Status
అర్హత ఉన్నా తల్లికి వందనం అమౌంట్ పడలేదా?
మీకు అర్హత ఉన్నప్పటికీ తల్లికి వందనం అమౌంట్ జమ కానీ పక్షంలో గ్రీవెన్స్ పెట్టుకునే ఆప్షన్ ని సదరు లబ్ధిదారులకు కల్పించడం జరిగింది.
కింద ఇవ్వబడిన ఏదైనా కేటగిరి లో అర్జీ పెట్టుకోవచ్చు. అర్జీ పెట్టుకొని సమస్య పరిష్కరించిన తర్వాత 26వ తేదీ లోపు నగదు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.

ఇక అంగన్వాడీ నుంచి కొత్తగా 1వ తరగతి కి వెళ్ళే పిల్లలు, మరియు10 వ తరగతి పూర్తయి కొత్తగా ఇంటర్ లో చేరే పిల్లలు పేర్లు,ప్రస్తుత అర్హుల జాబితాలో కనబడవు. ఈ నెల 21 నుంచి 26తారీకు వరక వీరి నమోదు ప్రక్రియ జరిగి, 30 వ తేదీన వెలువడే తుది జాబితాలో వీళ్ల పేర్లు వస్తాయి. వీళ్ళకి July 5 తర్వాత అమౌంట్ జమ అవుతాయి.
ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పూర్తి అయిన విద్యార్థులకు తల్లికి వందనం వర్తించదు. వారు ఇంటర్ తర్వాత జాయిన్ అయ్యే కోర్సును బట్టి ఫీజు రియంబర్స్మెంట్ (గతంలో విద్యా దీవెన) వర్తిస్తుంది. చదువు ఇంటర్ తో ఆపేస్తే తదుపరి ఎటువంటి పథకం వర్తించదు.
ఇక, ఒకే కుటుంబంలో ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉండి చదువుతున్నట్లయితే అటువంటి వారి జాబితాను ప్రభుత్వం పరిశీలనకు పంపింది. వీరితోపాటు అనాధ శరణాలయాలలో చదువుతున్నటువంటి పిల్లలకు కూడా ఇంకా అమౌంట్ జమ కాలేదు. ప్రస్తుతం వీరి ఫీల్డ్ వెరిఫికేషన్ కొనసాగుతుంది. విద్యాశాఖ అధికారులు పూర్తిగా పరిశీలించిన తర్వాతనే వారికి నగదు జమ చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.
మీ ఖాతాలో తల్లికి వందనం అమౌంట్ జమ అయిందా?
తల్లికి వందనం అమౌంట్ జమ అయిందా?
Thalliki Vandanam Payment Not Received Reasons
తల్లికి వందనం పథకం Thalliki Vandanam Scheme Payment Issue పేమెంట్ అందకపోవడానికి గల ముఖ్యమైన కారణాలు
1. తల్లి యొక్క ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతా [ NPCI ] లింక్ కాకపోయింటే ఏం చెయ్యాలి?
- ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతా లింకు లేక పోతే వారు తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లి ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది అయినప్పటికీ అనర్హుల జాబితాలో పేరు వచ్చినట్టయితే అప్పుడు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఆధార్ కార్డు NPCI LINK చేస్తూ కొత్త ఖాతాను ఓపెన్ చేసుకున్నట్టయితే వారికి నేరుగా నగదు అనేది ఆ ఎకౌంట్లో జమ అవుతుంది.
[ Open Link –> Consumer –> BASE –> Aadhaar Mapped Status ]
2. తల్లి లేదా పిల్లలు పూర్తిగా రైస్ కార్డులో లేకపోతే ఏం చేయాలి?
- తల్లి మరియు పిల్లలు తప్పనిసరిగా రైస్ కార్డు లో ఉండాలి. లేకపోతే ఈ పథకం వర్తించదు వేరువేరు కార్డులో ఉన్నప్పటికీ కూడా నగదు మాత్రం జమ అవుతుంది.
3. తల్లి లేదా పిల్లల HH eKYC పూర్తి కాకపోయి ఉంటే ఏం చేయాలి
- తల్లి మరియు పిల్లల హౌస్ మ్యాపింగ్ ఈ కేవైసీ పూర్తి అయి ఉండాలి. దానికిగాను గ్రామా లేదా వార్డు సచివాలయ ఉద్యోగులను కాంటాక్ట్ అయినట్లయితే OTP లేదా బయోమెట్రిక్ ద్వారా మీ eKYC పూర్తి చేస్తారు .
[ Open Link –> Enter Aadhaar –> Enter OTP –> Confirm Details–> Enter Mobile Number–> Submit ]
4. కుటుంబంలో ఎవరికి కూడా భూమి లేకపోయినా అర్హతకు మించి వేరే వారి భూమి వారి పేరుపై చూపిస్తే ఏం చేయాలి
- ఇంట్లో ఎవరు పేరుపై కూడా అర్హతకు మించి భూమి లేనప్పటికీ ఎక్కువ భూమి చూపిస్తున్నట్టయితే దాని అర్థం వేరే వారి భూమి మీ ఇంట్లో ఒకరు లేదా ఎక్కువ మంది ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండవచ్చు దానికి గాను మీరు మీ యొక్క గ్రామా లేదా వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ అధికారి లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారులను కాంటాక్ట్ అయ్యి గ్రీవెన్స్ కొరకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.NBM సైట్ లో BM Grievance Module లో Create a Grievance లో సంబంధిత అధికారులు Land అనే ఆప్షన్ లో మీ యొక్క అర్జీలు నమోదు చేసిన తర్వాత గ్రీవెన్స్ నెంబర్ తో మరల AP Seva Portal నందు Mobile Number and Pattadhar Aadhaar Number Seeding అనే సర్వీసు కు దరఖాస్తు చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది DA–>VRO–>RI–>MRO–>Approval–> Web Land & GSWS నందు డేటా అప్డేట్ అయినట్టయితే సమస్య క్లియర్ అవుతుంది . లేదా నేరుగా MRO వారి వెబ్ ల్యాండ్ రికార్డు నందు కూడా ఆధార్ కార్డు పై ఉన్నటువంటి తప్పుడు భూమిని డిసిడింగ్ చేసే అవకాశం ఉంది.
5. ఉండాల్సిన దానికన్నా ఎక్కువ భూమి చూపిస్తుంటే ఏం చేయాలి
- పైన (4) చెప్పినట్టుగానే పూర్తి ప్రాసెస్ ఉంటుంది కొత్తగా సచివాలయ అధికారులైన DA / WEDPS వారు Rectification of Entries in Record of Rights అనే సర్వీస్ కొరకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆమోదం ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది
6. భూమి అమ్మేసినా కూడా ఇంకా ఎక్కువ భూమి చూపించినప్పుడు ఏం చేయాలి
- పైన (4) చెప్పినట్టుగానే పూర్తి ప్రాసెస్ ఉంటుంది కొత్తగా సచివాలయ అధికారులైన DA / WEDPS వారు Mutation and Title deed cum Pattadar Passbook అనే సర్వీస్ కొరకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది . ఆమోదం ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది.
7. ఆధార నెంబరుకు వేరే వాళ్ళ కరెంటు మీటర్ కు లింక్ అయినప్పుడు ఏం చేయాలి
- ఈ సమస్య వచ్చినప్పుడు గ్రామా లేదా వార్డు సచివాలయంలో అర్జీ కొరకు దరఖాస్తు చేయాలి. మీటరు రీడింగ్ రసీదులతోపాటు ఆధార్ కార్డు, ఆధార్కు లింక్ అయినా మొబైల్ నెంబరు ఉన్నటువంటి ఫోను లబ్ధిదారుడు సచివాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి సంతకం పెట్టుకొని వెళ్ళాలి. DA / WEDPS అధికారులు NBM లో Electricity లో అర్జీ నమోదు చేసి, అర్జీ నెంబర్ తో అదే సైట్ లో లేదా GSWS Old Portal లో Aadhaar Seeding and Deseeding with Electric meter అనే సర్వీసు కు దరఖాస్తు చేయాలి [ Token ID అనగా అర్జీ అప్లికేషన్ నెంబర్ ] . ఆమోదం ప్రాసెస్ DA –> AE Discom –> Approval –> Discom & GSWS నందు డేటా అప్డేట్ అయిన తర్వాత సమస్య క్లియర్ అవుతుంది
8. వాడిన యూనిట్ల కన్నా ఎక్కువ యూనిట్లు చూపిస్తుంటే ఏం చేయాలి
- ఈ సమస్య వచ్చినట్టయితే అర్జీ నమోదు చేసిన తర్వాత అర్జీ నమోదు అప్లికేషన్ రసీదు నెంబర్తో AP Seva Portal / Meeseva Portal లో Application For Consumer Complaints – Wrong Billing అనే సర్వీస్ కొరకు దరఖాస్తు చేయాలి ఆమోదం ప్రాసెస్ పైన చెప్పిన విధంగానే ఉంటుంది .
9. మునిసిపాలిటీలో స్థలము ఏమీ లేనప్పటికీ వేరే వారిది చూపిస్తుంటే ఏం చేయాలి
- Urban Property అనే ఆప్షన్ పై అర్జీ నమోదు చేసి అర్జీ నెంబర్తో AP Seva Portal లో MAUD Services లో Title Transfer or De-Seeding of Aadhaar అనే సేవ కొరకు దరఖాస్తు చేయాలి. తుది ఆమోద విధానం DA –> MC –> Approval –> MAUD & GSWS డేటా బేస్ లో డేటా అప్డేట్ అయితే పూర్తి అవుతుంది
10. మున్సిపాలిటీలో చూపిస్తున్న స్థలమును లబ్ధిదారుని పేరు నుంచి తీసివేసినప్పటికీ ఇంకా వారి పేరుపై ఉన్నట్టు చూపిస్తున్నప్పుడు ఏం చేయాలి
- Urban Property నందు Data Not Updated in GSWS అనే ఆప్షన్ ఠీ అర్జీ నమోదు చేయాలి . MAUD Department వారు డేటా సరిచేయటం జరుగుతుంది .
11. ఇంట్లో ఎవరు కూడా ఆదాయపు పన్ను చెల్లించకుండా చెల్లిస్తున్నట్లు చూపిస్తుంటే ఏం చేయాలి
- ఇంట్లో ఎవరు కూడా ఆదాయపు పన్ను చెల్లించకుండా చెల్లిస్తున్నట్లు చూపించినట్టయితే వారు గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారులు వార్డు సచివాలయంలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అర్జీ కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆయా ఉద్యోగులు వారి యొక్క NBM లాగిన్ నందు Income Tax ఆప్షన్ నందు అర్జీ నమోదు చేస్తారు. అర్జీ నమోదు నెంబర్తో మరల అదే వెబ్సైట్లో Create Grievance Service Request నందు GSWS లో Income Tax లో సర్వీస్ అప్లై చేస్తారు . తుది ఆమోద విధానం DA –> MRO –> RDO –> JC –> GSWS డేటా బేస్ లో డేటా అప్డేట్ అయితే పూర్తి అవుతుంది
12. లబ్ధిదారులకు రైస్ కార్డు లేకపోతే ఏం చేయాలి
- నిజముగా రైస్ కార్డు లేక పొతే పథకానికి అనర్హులు . రైస్ కార్డు ఉండి ఇలా వస్తే వాలారు అర్జీ నమోదు చేసుకోవాలి . సచివాలయం లో DA / WEDPS అధికారులను కాంటాక్ట్ అవ్వాలి . వారు NBM సైట్ లో BM Grievance Module లో Create a Grievance లో Not having Rice Card అనే విషయం పై అర్జీ పెడతారు . రైస్ కార్డు వివరాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది . సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారు ఆమోదం అయ్యాక సమస్య క్లియర్ అవుతుంది . తుది ఆమోద విధానం DA –> VRO –> MRO –> Approval –> GSWS & Civil Supplies డేటా బేస్ లో డేటా అప్డేట్ అయితే పూర్తి అవుతుంది
13. ఇంట్లో ఎవ్వరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా, ప్రభుత్వ ఉద్యోగిగా చూపిస్తుంటే ఏం చేయాలి
- Government Employee అనే ఆప్షన్ తో అర్జీ నమోదు చేస్తారు. తుది ఆమోద విధానం DA –> Validation with CFMS –> Approval –> GSWS డేటా బేస్ లో డేటా అప్డేట్ అయితే పూర్తి అవుతుంది
14. లబ్ధిదారుడు నాలుగు చక్రాల వాహనాన్ని అమ్మేసిన తర్వాత కూడా వారి పేరుపై చూపిస్తూ ఉంటే ఏం చేయాలి
- Four-Wheeler అనే ఆప్షన్ తో అర్జీ నమోదు చేస్తారు. తుది ఆమోద విధానం DA –> RTO –> Approval –> Transport & GSWS డేటా బేస్ లో డేటా అప్డేట్ అయితే పూర్తి అవుతుంది
15. నాలుగు చక్రాల వాహనాన్ని టాక్సీగా మార్చిన తర్వాత కూడా నాలుగు చక్రాల వాహనంగా మాత్రమే పరిగణిస్తుంటే ఏం చేయాలి
- Four-Wheeler అనే ఆప్షన్ తో అర్జీ నమోదు చేస్తారు. తుది ఆమోద విధానం DA –> RTO –> Approval –> Transport & GSWS డేటా బేస్ లో డేటా అప్డేట్ అయితే పూర్తి అవుతుంది
16. లబ్ధిదారు మరియు పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేకపోతే ఏం చేయాలి
- హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ లో లేకపోతే గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించి సరైన డాక్యుమెంట్లు అనగా నివాస ధ్రువీకరణ పత్రము, ఆధార్ కార్డు పత్రములను సమర్పించి మ్యాపింగ్ లో చేరవచ్చు లేకపోతే నేరుగా కింద ఇచ్చిన లింకు ద్వారా సొంతంగా కూడా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేదా మీ పిల్లల్ని హౌస్ మ్యాపింగ్ లో చేర్చవచ్చు
[ Open Link –> Login –> Enter Aadhaar No –> Enter OTP –> If Showing “Already exists in the Household Data” Then HH Mapping Is Done –> Otherwise Do By Own or Visit Your VSWS ]
17. సరైన ఆదాయ ధ్రువీకరణ పత్రం లేకపోతే ఏం చేయాలి
- ఈ సమస్యతో ఎవరికైనా అనర్హుల జాబితాలో పేరు వచ్చినట్టయితే తప్పనిసరిగా విద్యార్థి పేరుపై మరియు తల్లి పేరుపై ఆదాయ ధ్రువీకరణ పత్రము Income Certificate ను గ్రామ లేదా వార్డు సచివాలయంలో లేదా మీ సేవలో ఆధార్ కార్డు నెంబర్ ప్రాప్తికి దరఖాస్తు చేసి MRO వారి తుది ఆమోదం తీసుకున్నట్లయితే సమస్య క్లియర్ అవుతుంది. విద్యార్థి పేరుపై ఆదాయ ధ్రువీకరణ అనగా ఇంట్లో ఎవరైతే సంపాదిస్తున్న వ్యక్తి ఉంటారో వారి పేరుపై దరఖాస్తు చేయాల్సి ఉంటుంది, ఆధార్ నెంబర్ మాత్రం విద్యార్థిది నమోదు అయి ఉండాలి. దరఖాస్తు చేసి తుది ఆమోదం అయిన తర్వాత కొన్ని రోజులకు అర్హుల జాబితాలోకి పేరు ఆటోమేటిగ్గా వచ్చి నగదు జమ అవుతుంది.
18. కుటుంబంలో 12 వేల రూపాయల కంటే ఎక్కువ జీతం తీసుకునేవారు ఉంటే ఏం చేయాలి
- Government Employee అనే ఆప్షన్ తో అర్జీ నమోదు చేస్తారు. తుది ఆమోద విధానం DA –> Validation with CFMS –> Approval –> GSWS డేటా బేస్ లో డేటా అప్డేట్ అయితే పూర్తి అవుతుంది ఔట్సోర్సింగ్ లో పనిచేస్తూ ఆదాయం గ్రామాల్లో 10000 పట్టణాల్లో 12 వేలకు మించి ఉన్నట్లయితే వారు కూడా అనర్హులుగా పరిగణించడం జరుగుతుంది. ఆదాయాన్ని మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేయడం జరిగింది అటువంటివారు గ్రీవెన్స్ పెట్టిన ఉపయోగముండదు
19. ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసులు అయినప్పటికీ వేరే రాష్ట్రంలో చదువుతున్నవారు ఎలా అర్జీ పెట్టుకోవాలి
- కేవలం రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే తల్లికి వందనం పథకం ద్వారా నగదు లబ్ధి చేకూరుతుంది
20. కేంద్రీయ విద్యాలయాలలో చదువుతున్నట్లయితే [ ప్రభుత్వం ఇంకా దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు ]
- కేంద్రీయ విద్యాలయాలలో చదువుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు తల్లికి వందనం పథకం నగదు క్రెడిట్ అవ్వలేదు వారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిన తరువాత మాత్రమే ఆయా పిల్లల తల్లులకు తల్లికి వందనం నగదు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది అంతవరకు వారికి నగదు క్రెడిట్ అవ్వదు దానికి వారు ఏం చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వ నిర్ణయం మేరకు వారికి నగదు క్రెడిట్ అవుతుందా అవ్వదా అనేది ఉంటుంది
21. పిల్లలు లేదా తల్లి యొక్క ఆధార్ కార్డు క్యాన్సిల్ అయ్యుంటే ఏం చెయ్యాలి
- తల్లి లేదా పిల్లల ఆధార్ కార్డు క్యాన్సిల్ అయినట్టయితే తప్పనిసరిగా వారు ఆధార్ సెంటర్ కు వెళ్లి మరల కొత్త ఆధార్ కార్డు కొరకు దరఖాస్తు చేసి అది ఆమోదం అయిన తరువాత ఆయా కొత్త ఆధార్ కార్డు నెంబర్ను హౌస్వోల్డ్ మ్యాపింగ్ లో జోడించి ఆ తరువాత రైస్ కార్డులో తప్పు ఆధార్ నెంబర్ను కరెక్షన్ చేసిన తరువాత మాత్రమే వారికి నగదు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. పిల్లలకు తల్లులకు సంబంధించి మార్చినటువంటి ఆధార్ నెంబర్ను స్కూల్ రికార్డ్ డేటాబేస్ లో కూడా అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నాడు వారికి నగదు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది
పైన చెప్పిన కారణాలలో ఏది ఉన్నా సరే వారికి తల్లికి వందనం నగదు క్రెడిట్ అవ్వదు. అసలైన అర్హులకు తప్పనిసరిగా ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలలో పై సమస్యలలో అర్హత ఉన్నప్పటికీ అనర్హులుగా జాబితాలో పేరు వచ్చిన లేదా అసలు జాబితాలోనే పేరు లేకపోయినా వారు అర్జీ పెట్టుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది . దరఖాస్తు చేసిన అర్జీలు తుది ఆమోదం పొందిన వారికి మరియు ఒకటవ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల తల్లులకు జులై 5వ తారీఖున పేమెంట్ విడుదల అవటం జరుగును
గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ అధికారి మరియు వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి NBM Web Site Login నందు అర్జీలు పెట్టుటకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఆప్షన్లు .
- Child is Eligible but details not found in Eligible and Ineligible list
- Children /Mother were not having Rice card
- Children /Mother were not in same Household
- Children /Mother were not in same Rice card
- Children /Mother/Guardian having same UID
- Children/Mother/Guardian not in Household
- Electricity
- Four Wheeler
- Government Employee
- Income Tax
- Invalid Child/Mother/ Guardian Aadhaar
- Land
- Mother/Guardian/Child/Father Death
- Not having rice card
- Payment
- Urban Property
అర్హుల మరియు అనర్హుల జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలి ?
ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం అర్హుల మరియు అనర్హుల జాబితాలో పిల్లల పేర్లు రాకపోతే అటువంటివారు తప్పనిసరిగా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి అర్జీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

అర్జీ నమోదుకు కావలసినటువంటి వివరాలు
- దరఖాస్తు ఫారం
- తల్లి ఆధార్ కార్డు
- రైస్ కార్డు
- పిల్లల ఆధార్ కార్డు
- మొబైల్ నెంబరు
- పిల్లల చైల్డ్ ఐడి [ పాఠశాలలో అడిగితే ఇస్తారు ]
- క్యాస్ట్ సర్టిఫికెట్ అందుబాటులో [ ఉంటే లేకపోతే అవసరం లేదు ]
Leave a Reply