తెలంగాణలో గ్యారెంటీ పథకాలలో భాగమైనటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
అర్హత ఉన్న వారందరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని దీపావళి కానుకగా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీపావళి ముగిసిన రెండు రోజులకు గ్రామ సభలో నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
అదేవిధంగా ఇందుకోసం ఒక ప్రత్యేక ఆప్ ని కూడా తీసుకు వస్తున్నట్లు ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ఇందిరమ్మ ఇండ్లు పథకం అంటే ఏమిటి? [What is Indiramma Indlu Scheme]
తెల్ల రేషన్ కార్డు ఉండి సొంత ఇల్లు లేనటువంటి తెలంగాణ పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను అందిస్తుంది.
ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం 250 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చి ఐదు లక్షల రూపాయలను ఇల్లు నిర్మాణానికి కేటాయిస్తుంది.
ఇందిరమ్మ ఇండ్లు పథకం అర్హతలు ఏంటి? [Eligibility for Indiramma Indlu Scheme]
ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి అర్హతలు కింది విధంగా ఉన్నాయి.
- లబ్ధిదారుడు తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి.
- సొంతంగా ఇల్లు ఉండరాదు.
- స్థలం కూడా లేనటువంటి వారికి స్థలం ప్రభుత్వం కేటాయించి ఇల్లు నిర్మిస్తుంది.
- ఒకవేళ సొంత స్థలం ఉన్నట్లయితే ఐదు లక్షల రూపాయలను ఇంటి నిర్మాణానికి అందిస్తుంది.
- తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.
ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ [ Indiramma Indlu Application Process and app]
ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి గ్రామ సభలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ అర్హులైన వారిని గుర్తించేందుకు సిద్ధమైంది.
వీటితోపాటు ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తులను ఆన్లైన్ యాప్ లో స్వీకరించినందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ కల్పిస్తుంది.
దీపావళి తర్వాత ఈ యాప్ ను ప్రభుత్వం విడుదల చేయనుంది.
Leave a Reply