ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Illu) పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి ఇల్లు కట్టుకునేందుకు వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి అయిన స్టేటస్ ని బట్టి ఐదు లక్షలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లుల చెల్లింపు షెడ్యూల్ ను మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందిరమ్మ ఇండ్ల చెల్లింపులు [Revised Schedule]
- మొదటి రెండవ దశ చెల్లింపులు లక్ష చప్పున యధావిధిగా ఉంటాయి.
- మూడవ దశలో చెల్లించే 2 లక్షల అమౌంట్ ఇకపై 1.60 లక్షలు గా ఉంటుంది.
- మిగతా అమౌంట్ ను తర్వాతి దశలో చెల్లిస్తారు.
Note: మొత్తంగా చెల్లించే 5 లక్షల అమౌంట్ లో ఎటువంటి మార్పు ఉండదు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు.

ఎందుకు ఈ మార్పులు చేశారు!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణలకు సంబంధించి 90 పని దినాలను జాతీయ ఉపాధి హామీ పథకం కింద వినియోగించుకోవచ్చని వెల్లడించింది. దీనితోపాటు మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా సౌలభ్యం కోసం ప్రభుత్వం పైన పేర్కొన్న విధంగా చెల్లింపు షెడ్యూల్ లో మార్పులు చేయడం జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది.




Leave a Reply