భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది, వందే భారత్ సహా అన్ని రైళ్లలో చార్జీలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏసీ చైర్ కార్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లాసు చార్జీలు తగ్గింపు
రైళ్లలో ఏసీ చైర్ కార్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కి సంబంధించినటువంటి టికెట్ చార్జీలను ఏకంగా 25 శాతం తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతానికి గత 30 రోజులులో 50% కంటే తక్కువ ఆక్యుపెన్సి ఉన్న రైళ్లలో ప్రధానంగా ఈ చార్జీల తగ్గింపును అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
మిగిలిన చార్జీలు యధాతథం
అయితే పైన పేర్కొన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మరియు ఏసి చైర్ కార్ మినహా ఇతర కోచ్ ల చార్జీలు యధావిధిగా ఉండనున్నాయు. అదేవిధంగా రిజర్వేషన్ చార్జీలు మరియు సూపర్ ఫాస్ట్ సర్ ఛార్జ్, జీఎస్టి వంటి చార్జీలు కూడా యధాతథంగా కొనసాగనున్నాయి.
ప్రస్తుతం ప్రకటించినటువంటి 25 శాతం తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని రైల్వే శాఖ ప్రకటించింది.
ప్రధానంగా ఇటీవల వరుసగా ప్రారంభిస్తున్నటువంటి వందే భారత్ ట్రైన్ లో ప్రయాణించేటటువంటి ఏసీ చైర్ కార్ మరియు ఎగ్జిక్యూటివ్ కోచ్ ప్రయాణికులకు ఈ నిర్ణయం మరింత ఊరట కలిగించనుంది.
Leave a Reply