2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్కమ్ పై రిటర్నుల ను ఏప్రిల్ 1 నుంచి సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది.
IT Returns Filing Start Date : 01 April 2023
ఈ సారి ఎందుకు సాధారణ గడువు కంటే ముందు ఆప్షన్ ఇచ్చారు?
ఈ సారి గడువు కంటే ముందే ఈ అవకాశం కలిపించింది. అది కూడా 2023-24 అస్సేస్మెంట్ సంవత్సరం ప్రారంభం రోజు నుంచే సంబంధిత ఫార్మ్స్ అన్ని అందుబాటులో ఉంటాయని సీబీడీటీ వెల్లడించింది.
అంతకు ముందు ఏడాది ఐటీఆర్ పత్రాలతో పోలిస్తే ఈసారి పెద్దగా మార్పులేమీ లేనందున, పన్ను రిటర్నులు దాఖలు చేసేవారు సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని పేర్కొంది. అంతే కాదు, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మరియు అంతకు ముందు ఏడాది పన్ను రాయితీలలో పెద్దగా మార్పులు లేవు. Individual వ్యక్తులు, వృత్తి నిపుణులు, వ్యాపార సంస్థలు దాఖలు చేసే 1-6 వరకు అన్ని ITR ఫార్మ్స్ ను సీబీడీటీ ఇప్పటికే నోటిఫై చేసింది. ఈ సారి అసెస్‌మెంట్ ఇయర్ ప్రారంభం నుంచే రిటర్నులు దాఖలు చేయడం వల్ల, పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది. ప్రతి ఏడాది లా నే జులై 31 వరకు రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు ఉంటుంది. అయితే ప్రతి సారి పలు అనివార్య సందర్భాల్లో సీబీడీటీ ఈ గడువును పొడిగిస్తూ ఉంటుంది.
Leave a Reply