వికలాంగ, ఆరోగ్య పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్య సూచనలు

వికలాంగ, ఆరోగ్య పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్య సూచనలు

Table of Contents

వికలాంగులు, మెడికల్ పింఛనుదారులకు కొత్త మార్గదర్శకాలు – పూర్తి వివరాలు

ప్రభుత్వం తాజాగా వికలాంగులు, మెడికల్ పింఛనుదారులకు సంబంధించిన పింఛన్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు పింఛన్ అర్హతలు, వైద్య ధృవీకరణ, శాతం ఆధారిత అర్హతలు, ఆర్థిక సహాయం మరియు దరఖాస్తు విధానం వంటి అంశాలను కవర్ చేస్తున్నాయి. 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఆ విధంగా నోటీసులు జారీ చేసిన వారు వెంటనే ఆపిల్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం వెల్లడించింది.

వికలాంగ పెన్షన్ కి అర్హత ఉండి కూడా అనర్హత నోటీసులు పొందిన వారు ఆగస్టు 30 లోపు ఆపిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పీల్ చేసుకునేందుకు మీ గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించండి.

పింఛన్ అర్హతలు & షరతులు

  • హెల్త్ పెన్షన్ – కనీసం రూ.15,000/- వరకు మాత్రమే అర్హులు.
  • 85% పైగా శారీరక వైకల్యంతో ఉన్నవారు, వైద్యుల ధృవీకరణ ఆధారంగా పింఛన్ పొందగలరు.
  • 40% నుండి 60% శాతం ఉన్న వికలాంగులు, సెప్టెంబర్ నెల నుండి కొత్త పింఛన్ పొందవచ్చు.
  • 85% కంటే తక్కువ ఉన్న వికలాంగులు రూ.6,000/- వరకు పొందగలరు.

ఆర్థిక సహాయం

  • 40% పైగా వికలాంగత ఉన్నవారికి నెలకు రూ.4,000/- అదనపు సహాయం.
  • 60% పైగా ఉన్నవారికి నెలకు రూ.6,000/- వరకు పింఛన్.
  • 85% పైగా ఉన్నవారికి గరిష్టంగా రూ.15,000/- వరకు పింఛన్.

దరఖాస్తు విధానం

  1. అభ్యర్థులు తప్పనిసరిగా వైద్య ధృవీకరణ పత్రం సమర్పించాలి.
  2. గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
  3. ప్రతీ నెల 25వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలి.
  4. కొత్తగా అర్హులైన వారు 30 రోజుల్లోగా పింఛన్ కోసం అప్లై చేయాలి.

ముఖ్య గమనికలు

  • పింఛన్ మంజూరు కాలేదని అనుకుంటే, మళ్లీ వైద్య ధృవీకరణ పత్రంతో దరఖాస్తు చేయవచ్చు.
  • తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
  • సంబంధిత అధికారులు పరిశీలించి పింఛన్ మంజూరు చేస్తారు.
  • ఆదేశముల ప్రకారం హెల్త్ పెన్షన్ అనగా 15000/- పింఛన్ పొందుతున్న వారికి ఇంటింటికి వచ్చి వెరిఫై చేయడం జరిగినది, ఎవరికైతే 85% పైబడి వికలాంగత ఉండి మంచానికే పరిమితమైనట్టు డాక్టర్ల సముదాయం రిపోర్ట్ చేసినారో వారికి 15000- యధావిధిగా సెప్టెంబర్ నెల నుంచి వచ్చును.
  • వెరిఫికేషన్ లో వికలాంగుల శాతం 85% కంటే తక్కువ ఉంది 40% కంటే ఎక్కువ ఉన్నట్లయితే హెల్త్ పెన్షన్ నుండి వికలాంగ పెన్షన్లకు అనగా15000/- నుండి 6000/- కు మార్పు చేయుట జరిగినది.
  • 40% కంటే వికలాంగత తక్కువగా ఉన్న ఎడల పింఛనుదారుల వయసు 60సంవత్సరాలు పైబడినచో వారికి 15000/- లకు బదులు వృద్ధాప్య పెన్షన్ గా పరిగణించబడి 4000/- రూపాయలకు మంజూరు కాబడినది.
  • 40% కంటే వికలాంగత తక్కువ ఉండి 60 సంవత్సరాలు లేని యెడల వారికి సెప్టెంబర్ నెల నుండి పింఛన్ నిలుపుదల చేయడం జరుగుచున్నది.
  • అదేవిధంగా వికలాంగ పింఛన్ లో కూడా 40% పైబడి ఉన్నట్లయితే వారికి యధావిధిగా వికలాంగుల పింఛన్ 6000/- వచ్చును.
  • వికలాంగత శాతం 40% కంటే తక్కువగా ఉండి పింఛన్ దారులకు 60 సంవత్సరాల నిండిన యెడల వారికి వృద్ధాప్య పింఛను గా మార్చబడి 4000/-వచ్చును.
  • 40% కంటే తక్కువగా ఉండి 60 సంవత్సరాలు లేని యెడల వారి యొక్క వికలాంగుల పింఛను సెప్టెంబర్ నెల నుండి నిలుపుదల చేయబడును.
  • ఈ విషయంపై తెలియజేయవలసినది ఏమిటంటే, పింఛన్ నిలుపుదల చేసిన వారి వివరాలు ఇప్పటికే సచివాలయం లాగిన్‌లో చూపిస్తున్నాయి
  • ఆ నోటీసును డౌన్లోడ్ చేసి పింఛన్ దారులకు అందజేసి ఎక్నాలజీమెంట్ పొందవలెను. ఇది ఈనెల 25వ తేదీ లోపుగా పూర్తి చేయవలెను.
  • ఆ నోటీసును డౌన్‌లోడ్ చేసి, పింఛన్ దారులకు అందజేసి, వారి నుండి అంగీకార పత్రం (Acknowledgement) తీసుకోవలెను. ఈ ప్రక్రియను ఈ నెల 25వ తేదీ లోపుగా పూర్తిచేయాలి
  • ఎవరి పింఛన్ రద్దు చేయబడిందో వారు పాత సదరం సర్టిఫికేట్ మరియు ఈ నోటీసును తీసుకొని జి.జి.హెచ్ లేదా ఏరియా ఆసుపత్రికి వెళ్లి, సంబంధిత వైద్యుడి ద్వారా ధృవీకరించించుకోవాలి. అనంతరం, నిబంధనల ప్రకారం ఉన్న ప్రొఫార్మా ఆధారంగా మాన్యువల్ సర్టిఫికేట్ పొందవలెను.”
  • ఆ మాన్యువల్ సర్టిఫికేట్ మరియు మిగిలిన అవసరమైన పత్రాలను కలిపి, సంబంధిత ఎంపీడీవో గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారికి అప్పీల్ చేసుకోవాలి.”
  • అప్పీల్‌ను, నోటీసు అందిన తేదీ నుండి 30 రోజుల లోపు మాత్రమే సమర్పించవలెను.”

ఈ కొత్త నిబంధనల వల్ల వికలాంగులు, మెడికల్ పింఛనుదారులకు ఆర్థికంగా పెద్ద సహాయం లభించనుంది. వైద్య ఖర్చులు, జీవనాధారాలు, దైనందిన అవసరాల కోసం ఈ పింఛన్లు ఉపయోగపడతాయి.

ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త మార్గదర్శకాలు వికలాంగులు, మెడికల్ పింఛనుదారుల జీవిత ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఉన్నాయి. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ తక్షణం సచివాలయాలను సంప్రదించి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

Frequently Asked Questions (FAQs)

1. సెప్టెంబర్ 2025 నెల పింఛన్ పంపిణీలో ఎవరి పింఛను రద్దు అవుతుంది?

సదరం శాతం 40% కన్నా తక్కువగా ఉన్నవారు అప్పీల్ చేయకపోతే వారి పింఛను రద్దు అవుతుంది.

2. పింఛను రద్దు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ప్రభుత్వం ఇచ్చిన నోటీసు వచ్చినవారు తప్పనిసరిగా అప్పీల్ దరఖాస్తు చేయాలి.

3. అప్పీల్ ఎక్కడ చేయాలి?

గ్రామాల్లో ఉంటే మండల ఎంపీడీవో కార్యాలయంలో, పట్టణాల్లో ఉంటే మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి.

4. అప్పీల్ చివరి తేదీ ఎప్పుడు?

ఆన్‌లైన్ సదుపాయం ఉన్న ప్రాంతాల్లో ఆగస్టు 30 సాయంత్రం 5 గంటల వరకు, ఆన్లైన్ సదుపాయం లేని ప్రాంతాల్లో ఆగస్టు 29 సాయంత్రం 5 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి.

5. 40% పైగా సదరం ఉన్నవారు వికలాంగుల పింఛన్ నుండి వృద్ధాప్య పింఛనుకు మారితే ఏమవుతుంది?

అప్పీల్ చేయకపోతే 6000 రూపాయల వికలాంగుల పింఛను 4000 రూపాయల వృద్ధాప్య పింఛనుగా మారుతుంది.

6. అసలు అప్పీల్ అంటే ఏమిటి?

అప్పీల్ అంటే అర్జీ పెట్టుకోవడం.

7. అప్పీల్ చేయడానికి ఏ డాక్యుమెంట్లు కావాలి?

నోటీసు జిరాక్స్, ఆధార్ కార్డు, మెడికల్ రిపోర్టులు, పాత సదరం సర్టిఫికెట్ (ఉంటే), మరియు ఒక లెటర్.

8. కొత్త సదరం సర్టిఫికెట్ ఎక్కడ వస్తుంది?

రీ-అసెస్మెంట్ తర్వాత గ్రామ/వార్డు సచివాలయంలో కొత్త సర్టిఫికెట్ ఇస్తారు.

9. కొత్త సదరం సర్టిఫికెట్ లో ఎంత శాతం ఉంటే పెన్షన్ వస్తుంది?

కనీసం 40% కంటే ఎక్కువ ఉండాలి.

10. తాత్కాలిక సర్టిఫికెట్ లో 40% పైగా ఉంటే ఏమవుతుంది?

పెన్షన్ యధావిధిగా కొనసాగుతుంది.

11. 15,000 మెడికల్ పింఛన్ పొందుతున్నవారికి ఎన్ని శాతం ఉండాలి?

కనీసం 85% పైగా సదరం ఉండాలి.

12. 40%–85% మధ్య సదరం ఉంటే ఏమవుతుంది?

మెడికల్ పింఛన్ 15,000 నుండి 6,000 వికలాంగుల పింఛనుగా మారుతుంది.

13. 40% కన్నా తక్కువ ఉంటే ఏమవుతుంది?

పింఛను రద్దవుతుంది. వృద్ధాప్యానికి అర్హులైతే 4000 పింఛనుగా మారుతుంది.

14. వికలాంగుల పింఛన్ తీసుకుంటున్నవారు 40% కంటే తక్కువ అయితే?

వృద్ధాప్యానికి అర్హులైతే 4000 పింఛనుగా మారుతుంది.

15. వితంతువులకు ఏమవుతుంది?

వారి పెన్షన్ వితంతు పింఛనుగా మారుతుంది. దరఖాస్తు తప్పనిసరి.

16. మార్పులు లేదా రద్దు పై సమస్య ఉంటే ఎక్కడ అర్జీ పెట్టుకోవాలి?

ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో. ఆపై రీ-అసెస్మెంట్ జరుగుతుంది.

17. ఎంత శాతం ఉంటే ఎంత పింఛన్ వస్తుంది?

  • 40%–100% వికలాంగుల పింఛన్ → ₹6,000
  • 40%–85% మెడికల్ పింఛన్ → ₹6,000
  • 85% పైగా మెడికల్ పింఛన్ → ₹15,000

18. నోటీసు లేదా సర్టిఫికెట్ సమస్యలపై ఎవరిని సంప్రదించాలి?

గ్రామ/వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీని సంప్రదించాలి.

19. కొత్త పింఛన్ దరఖాస్తులు ప్రస్తుతం ఓపెన్ లో ఉన్నాయా?

లేదు. కేవలం వితంతు పెన్షన్ దరఖాస్తులు మాత్రమే తీసుకుంటున్నారు.

20. నోటీసు వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో అర్జీ పెట్టుకోవాలి?

30 రోజుల్లోపు తప్పనిసరిగా దరఖాస్తు చేయాలి.

21. నోటీసు తీసుకోవడానికి నిరాకరిస్తే ఏమవుతుంది?

పెన్షన్ హోల్డ్ అవుతుంది. మళ్లీ నిరాకరిస్తే రద్దు అవుతుంది.

22. రీ-అసెస్మెంట్ నోటీసు వచ్చినవారి పరిస్థితి ఏమిటి?

ఆసుపత్రికి వెళ్లి రీ-అసెస్మెంట్ చేయించాలి. కొత్త సర్టిఫికెట్ ప్రకారం పెన్షన్ కొనసాగుతుంది, మారుతుంది లేదా రద్దు అవుతుంది.

Click here to Share

2 responses to “వికలాంగ, ఆరోగ్య పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్య సూచనలు”

  1. ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన వారందరి పెన్షన్లు కొనసాగించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు – STUDYBIZZ

    […] వికలాంగ, ఆరోగ్య పెన్షన్ లబ్ధిదారులకు… […]

  2. Ravikumar Avatar
    Ravikumar

    Naku helth problem vachhi 2023 lo hospital lo cheri 2024 april lo discharge ayyanu Naku 17laks ayyindi appati jagan govt lo cm relief fund kosam apply chesukuneloga election vachhi agipoyiundi ippati govt lo yennisarlu try chesina raledu yenni sarlu uknoldgement post chesina no usemy reports adi raledu ani sadaran kosam slot book chesukoni aa report kosam wait chestunna online lo koditey id not hospital pending ani vastundi Naku left leg problem 4 fingers tisesaru gadavadaniki kastamuga undi we government ladies ki thappa migtha variki help cheyyademo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page