జగనన్న అమ్మఒడి పథకాన్ని జూన్ 28న ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికీ నెల రోజుల పూర్తయిన నేపథ్యంలో ఇంకా కొంతమంది లబ్ధిదారులకు వివిధ కారణాల ద్వారా పేమెంట్ ఫెయిల్ అవ్వడం జరిగింది. అటువంటి వారికి సచివాలయం శాఖ నుంచి ముఖ్యమైన సమాచారం వెలువడింది.
ఈవారం మరోసారి పేమెంట్స్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది
అమ్మ ఒడి పథకానికి సంబంధించి వివిధ కారణాల ద్వారా పేమెంట్ ఫెయిల్ అయిన వారికి ఈ వారం మరొకసారి పేమెంట్స్ ప్రాసెస్ చేయడం జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
ముఖ్యంగా ఆధార్ కి బ్యాంకు లింక్ చేసుకోకపోవడం అనగా NPCI మ్యాపింగ్ జరగకపోవడం, బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో లేకపోవడం వంటి కారణాల వలన ఎవరికైతే పేమెంట్ ఫెయిల్ అయిందో వారికి ఈ వారంలో పేమెంట్స్ రీ ప్రాసెస్ చేసే అవకాశం ఉంది.
NPCI మ్యాపింగ్ లేనివారు వెంటనే లింక్ చేసుకోండి
ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి మీ అమౌంట్ జమ అయ్యేటటువంటి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసేటప్పుడు NPCI మ్యాపింగ్ కూడా చేయడం జరుగుతుంది.
NPCI మ్యాపింగ్ చేయడం ద్వారా మీ అన్నీ సంక్షేమ పథకాల అమౌంట్ అదే ఖాతాలో జమ అవుతుంది.
మీ బ్యాంక్ ఖాతా కు npci లింక్ అయిందా లేదా కింది లింక్ ద్వారా తెలుసుకోండి
లింక్ కాని వారికి ఎలా లింక్ చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ కింది లింక్ లో ఇవ్వబడింది చెక్ చేయండి.
ఒకవేళ ఇదే కారణంతో మీకు అమ్మ ఒడి పేమెంట్ జరగనట్లయితే ఈ విషయాన్ని సచివాలయంలో ముందుగా నిర్ధారించుకోండి. ఆ తర్వాత బ్యాంకు కి వెళ్లి npci మ్యాపింగ్ ఆధార్ లింకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా లింక్ చేసుకున్న వారు మీ సచివాలయానికి వెళ్లి మీరు కొత్తగా లింక్ చేసుకున్నట్లు వారికి తెలపాల్సి ఉంటుంది.
అమ్మ ఒడి అమౌంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి
కింద ఇవ్వబడిన ప్రాసెస్ మరియు లింక్ ద్వారా మీరు అమ్మ ఒడి కి సంబంధించి లేటెస్ట్ స్టేటస్ చెక్ చేయవచ్చు.
జూలై చివరి వారం వరకు లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా జమ చేయడం జరిగింది. ఇంకా ఎవరికైనా అమౌంట్ పడకపోతే వెంటనే మీ సచివాలయంలో సంప్రదించండి.
Leave a Reply